చిరంజీవి ఇంట్లో మీటింగ్ పై నిర్మాత షాకింగ్ కామెంట్స్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మళ్లీ గ్రూపు సమావేశాలు జరుగుతున్నాయ అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.గత కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకున్నట్లు మనకు తెలిసిందే.

 Natti Kumar Fires On Chiranjeevi Meeting With Tollywood Natti Kumar, Chiranjeevi-TeluguStop.com

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఉన్న కొన్ని సమస్యల పై మెగాస్టార్ చిరంజీవి సీఎం దృష్టికి తీసుకువెళ్లనున్నారు.

ఈ క్రమంలోనే సినీ ప్రముఖులతో కలిసి ఆదివారం మెగాస్టార్ తన ఇంట్లో సమావేశమైన సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈ సమావేశానికి కేవలం కొందరు నిర్మాతలు, నాగార్జున మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది.తాజాగా ఈ సమావేశం పై ఓ నిర్మాత స్పందిస్తూ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఏ సమావేశం జరిగిందో వారికే తెలియదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు చిన్న నిర్మాత నట్టికుమార్.

Telugu Chiranjeevi, Natti Kumar, Nattikumar, Tollywood-Movie

చిరంజీవి ఇంట్లో జరిగిన సమావేశం గురించి నట్టికుమార్ మాట్లాడుతూ.అసలు అక్కడ ఏం జరిగిందో వారికే తెలియడం లేదు మీటింగ్ అంటే నిర్మాతల ప్రెసిడెంట్, సెక్రెటరీ వంటి వారి కూడా ఉండాలి.ముందుగా మీరు మాతో చర్చించి మా సమస్యలు తెలుసుకుని అవి మెగాస్టార్ చిరంజీవి గారు ముందు పెట్టాలి అయితే ఇవేవీ లేకుండా మీటింగ్ జరగడం పై ఆయన విమర్శలు చేశారు.ఇండస్ట్రీలో అందరి సమస్యలు తెలుసుకుని అందరితో కలుపుగోలుగా ఉండాలి.

మా సమస్యను కూడా పట్టించుకోవాలి కదా అంటూ నిర్మాత ఈ సమావేశం పై విమర్శలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube