ఇమ్మిగ్రేషన్ అంశాలపై నాట్స్ వెబినార్

అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఇమిగ్రేషన్ అంశాలపై వెబినార్ నిర్వహించింది. నాట్స్ హ్యూస్టన్ విభాగం ద్వారా నిర్వహించిన ఈ వెబినార్‌కు మంచిస్పందన లభించింది.

 Nats Webinar About Immigration Eliments-TeluguStop.com

వెబినార్‌లో ప్రముఖ న్యాయవాది ఉమ మంత్రవాది పాల్గొన్నారు.ఒక వైపు కరోనా.

మరో వైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలు.ఈ తరుణంలో ఇమ్మిగ్రేషన్ అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ వెబినార్ ఎంతగానో దోహదపడింది.

 Nats Webinar About Immigration Eliments-ఇమ్మిగ్రేషన్ అంశాలపై నాట్స్ వెబినార్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇమ్మిగ్రేషన్ కొత్త నియమ నిబంధనలు..

గ్రీన్ కార్డులకు సంబంధించిన అంశాలను ఈ వెబినార్‌లో ఉమ చక్కగా వివరించారు.కేవలం స్నేహితులు, సన్నిహితుల సమచారం మేరకు ఇమ్మిగ్రేషన్ అంశాలపై అవగాహనకు రావడం మంచిది కాదని ఆమె అన్నారు.

ఇమ్మిగ్రేషన్ అంశాల్లో ప్రతి చిన్న విషయం చాలా కీలకంగా మారే అవకాశం ఉందని.కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.

ఈ విషయంలో కచ్చితంగా న్యాయవాదుల సలహాలు, సూచనలు పాటిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉంటాయని ఆమె తెలిపారు.ఈ వెబినార్‌లో పాల్గొన్న తెలుగువారికి ఎన్నో విలువైన సూచనలు,సలహాలు అందించారు.

వారి సందేహాలను నివృత్తి చేశారు.

తన విలువైన సమయాన్ని వెచ్చించి నాట్స్ సభ్యుల సందేహాలను తీర్చినందుకు నాట్స్ అధ్యక్షులు విజయ శేఖర్ అన్నే ఉమాకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా నాట్స్ హౌస్టన్ విభాగ సమన్వయకర్త, వీరు కంకటాల హౌస్టన్ తో పాటు పరిసర నగరాలలో నాట్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు.ఇంకా ఈ కార్యక్రమం లో నాట్స్ బోర్డు సభ్యులు, సునీల్ పాలేరు, సహా కోశాధికారి హేమంత్ కొల్ల, నాట్స్ సామాజిక మాధ్యమ విభాగ ఇంచార్జి శ్రీనివాస్ కాకుమాను, హౌస్టన్ విభాగ క్రీడా సమన్వయకర్త, చంద్ర తెర్లి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి హౌస్టన్ విభాగ సహ సమన్వయకర్త విజయ్ దొంతరాజు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

మున్ముందు ఇమ్మిగ్రేషన్ సంబంధిత మరిన్ని కార్యక్రమాలు చేపడతామని నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, అధ్యక్షుడు శేఖర్ అన్నే లు తెలియ చేసారు.

#America #Visa #Webinar #NATS Chairman #Suggestions

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు