టెక్సాస్‌లో నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్

డాలస్, టెక్సాస్, సెప్టెంబర్ 6: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా టెక్సాస్‌లో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించింది.నాట్స్ డాలస్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ 12వ ఎడిషన్ వాలీబాల్ టోర్నమెంట్‌లో దాదాపు 35 టీంలు పాల్గొనేందుకు ముందుకు వేస్తే అందులో 28 టీం లకు ఈ టోర్నమెంట్‌లో ఆడే అవకాశం లభించింది.

 Nats Volleyball Tournament In Texas , Bapu Noothi, Satya Sriramineni, Gautham Ka-TeluguStop.com

టెక్సాస్‌లోని గ్రేప్‌వైన్, ఫీల్డ్ హౌస్‌ వేదికగా ఈ టోర్నమెంట్ జరిగింది.నాట్స్ ప్రో కప్, నాట్స్ అడ్వాన్స్‌డ్ కప్ ఇలా రెండు విభాగాలుగా వాలీబాల్ పోటీలు జరిగాయి.

ఇందులో వాలీ వాల్వ్స్ జట్టు నాట్స్ ప్రో కప్‌ను సొంతం చేసుకుంది.గ్రావిటీ విన్స్ టీం రన్నరప్‌గా నిలిచింది.

నాట్స్ అడ్వాన్స్స్‌డ్ కప్‌ను వీవీఎస్1 టీం సొంతం చేసుకుంది.

వికింగ్స్ టీం రన్నరప్‌గా నిలిచింది.

నాట్స్ డాలస్ క్రీడా విభాగం, నాట్స్ సభ్యులు ఈ టోర్నమెంట్ విజయవంతం కోసం ముందు నుంచి భారీ కసరత్తు చేశారు.నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి, సత్య శ్రీరామినేని, గౌతం కసిరెడ్డి, రాజేంద్ర మాదల, జ్యోతి వనం, విజయ్ బల్ల, శ్రీధర్ విన్నమూరి, పార్థ బొత్స, సురేంద్ర ధూళిపాళ్ల, శ్రీధర్ నేలమడుగుల, ప్రసాద్ డీవీ, రవీంద్ర చిట్టూరి, రవీంద్ర చుండూరు, డెన్నీస్ సురేంద్రతో పాటు ఇతర డాలస్ సభ్యులంతా ఈ టోర్నమెంట్ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు.

స్పోర్ట్స్ కమిటీ ఛైర్మన్ గౌతం కసిరెడ్డి, కో ఛైర్మన్ విజయ్ బల్ల, ఇతర స్పోర్ట్స్ కమిటీ సభ్యులు ఈ టోర్నమెంట్ దిగ్విజయంగా నడిపించినందుకు నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ సాగునీటి శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమా విచ్చేసి ఆటగాళ్లను ప్రోత్సాహించేలా మాట్లాడారు.

తెలుగువారిలో క్రీడా స్ఫూర్తి ఎంత ఉందనేది ఇలాంటి టోర్నమెంట్లే రుజువు చేస్తున్నాయన్నారు.దేవినేని ఉమాకు నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube