అమెరికాలో తెలుగు సంబరాలు హోరేత్తనున్నాయి.మే, జులై నెలల్లో రెండు తెలుగు సంస్థలు నాట్స్, తానా నిర్వహించే తెలుగు సంబరాలు అంబరాన్ని అంటేలా ఆయా సంస్థ ప్రతినిధులు సదస్సులు నిర్వహిస్తూ కార్యక్రమాల రూపకల్పన విధి విధానాలని చర్చించుకుంటున్నారు.
ఆధ్యాంతం ఎంతో ఉల్లాసంగా సంస్థ ప్రతినిధులు అందరిని కలుపుకుంటూ వేడుకల నిర్వహణని పరీక్షిస్తున్నారు.
ఈ క్రమంలోనే మే 24,25,26 తేదీల్లో ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటరులో “నాట్స్” నిర్వహిస్తున్న 6వ అమెరికా తెలుగు సంబరాల ప్రణాళిక సదస్సు ఆదివారం నాడు నాట్స్ సమన్వయకర్త కంచర్ల కిషోర్ ఆధ్వర్యంలో డల్లాస్‌లో ఏర్పాటు చేశారు.
సంబరాలకు సంబంధించిన ఏర్పాట్లపై వివిధ కమిటీల చైర్మెన్ లు సభ్యులు ఈ సదస్సులో పాల్గొన్నారు.ఈ మహా సభల విజయవంతానికి తీసుకోవల్సిన చర్యలపై కూలకషంగా చర్చిచుకున్నారు.

వివిధ కమిటీల సభ్యులు తమ తమ సలహాలు, సూచనలు అందించారు.ఈ వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాల నుండీ పెద్ద సంఖ్యలో అతిధులు హాజరవుతున్నారు.“మనమంతా తెలుగు-మనసంతా వెలుగు” అనే నినాదంతో నినాదంతో నిర్వహించే ఈ వేడుకలకి తెలుగు వారందరూ హాజరయ్యి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు.