సెయింట్ లూయిస్‌లో నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్

సెయింట్ ‌లూయిస్‌: నవంబర్ 23: తమలో క్రీడా ప్రతిభను చాటిన తెలుగు క్రీడాకారులు సెయింట్‌ లూయిస్‌లో నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్‌కు అద్భుత స్పందన లభించింది.స్థానికంగా ఉండే తెలుగు క్రీడాకారులు ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకున్నారు.20 వాలీబాల్ టీంలు ఈ టోర్నమెంట్‌లో తలపడ్డాయి.పూల్ ఏ, పూల్ బీ అని రెండు భాగాలుగా టీంలను విభజించి నాట్స్ ఈ టోర్నమెంట్ నిర్వహించింది.

 Nats St Luis Chapter At Your Earliest Convenience-TeluguStop.com

పూల్ ఏలో వీబీ అడిక్ట్స్ అద్భుతంగా ఆడి విజేతగా నిలిచింది.రౌడీస్ టీం రన్నరప్ గా నిలిచింది.పూల్ బీ లో కూల్ డూడ్స్ టీం విన్నర్స్ , ధ్వని టీం రన్నర్స్ ట్రోఫీని దక్కించుకున్నాయి.దాదాపు 200 మందికిపై వాలీబాల్ ప్లేయర్లు ఎంతో ఉత్సాహంగా ఈ టోర్నమెంట్ లో తమలోని క్రీడా ప్రతిభను చాటేందుకు పోటీ పడ్డారు.

అటు ఈ గేమ్ ను చూసేందుకు స్థానికంగా ఉండే తెలుగువారు కుటుంబాలతో పాటు కూడా విచ్చేసి క్రీడాకారులను ఉత్సాహాపరిచారు.నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ సుధీర్ అట్లూరి, నాట్స్ సర్వీస్ కో ఆర్డినేటర్ రమేశ్ బెల్లం, నాట్స్ సెయింట్ లూయిస్ ఛాప్టర్ కోఆర్డినేటర్ నాగ శిష్ట్లా, నాట్స్ సెయింట్ లూయిస్ ఛాప్టర్ నాయకులు సతీష్ ముమ్మనగండి తదితరులు ఈ టోర్నమెంట్ నిర్వహాణలో కీలకపాత్ర పోషించారు.

విన్నర్, రన్నర్ ట్రోఫీలు అందించడంతో పాటు అత్యుత్తమ ఆటగాళ్లకు ప్రత్యేక బహుమతులు అందించి వారిని భుజం తట్టి ప్రోత్సాహించారు.టీఏఎస్ ప్రెసిడింట్ సురేంద్ర బాచిన, టీఏఎస్ ట్రెజరర్ రంగ సురేశ్, టీఏఎస్ డైరక్టర్ జగన్ వేజండ్ల స్థానిక తెలుగు ప్రముఖులు శ్రీనివాస్ కొటారు, విజయ్ బుడ్డి, అప్పలనాయుడు, శివ మామిళ్లపల్లి తదితరులు క్రీడాకారులకు బహుమతులు అందించారు.

పవన్ దగ్గుమాటి, పవన్ కొల్లలు ఈ టోర్నమెంట్ విజయానికి తమవంతు సహాయ సహాకారాలు అందించారు.తెలుగువారిలో క్రీడా స్ఫూర్తిని రగిలించేందుకు ఇలాంటి మరిన్ని టోర్నమెంటు నిర్వహిస్తామని ఈ సందర్భంగా నాట్స్ తెలిపింది.

ఈ టోర్నమెంట్‌ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి అభినందించారు.నాట్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

Telugu Fool, Nats, Natsstluis, Twentyvollyball, Volley-
Telugu Fool, Nats, Natsstluis, Twentyvollyball, Volley-
Telugu Fool, Nats, Natsstluis, Twentyvollyball, Volley-
Telugu Fool, Nats, Natsstluis, Twentyvollyball, Volley- .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube