నాట్స్ హౌస్టన్ విభాగం - బాలల సంబరాలు 2020

విద్యార్ధుల్లో సృజనాత్మకతను వెలికితీసి… వారిని ప్రోత్సాహించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.హ్యూస్టన్ లో బాలల సంబరాలు నిర్వహించింది.

 Nats Houston Chapter Baalala Sambaralu 2020-TeluguStop.com

హ్యూస్టన్ రాష్ట్రంలోని మిస్సోరిలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న నాట్స్.బాలల సంబరాల కోసం చిన్నారులకు మ్యాథ్స్ ఛాలెంజ్, తెలుగు మాట్లాట, స్పెల్లింగ్ బీ పోటీలు నిర్వహించింది.8 ఏళ్ల లోపు చిన్నారులను జూనియర్, సీనియర్ల విభాగాలుగా విభజించి ఈ పోటీలు నిర్వహించింది.మూడు విభాగాలలోను దాదాపుగా 120 మంది పిల్లలు తమ ప్రజ్ఞపాటవాలను ప్రదర్శించారు.

వీటిలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి నాట్స్ బహుమతులు అందచేసింది.హ్యూస్టన్, గ్రేటర్ హౌస్టన్ నుండి దాదాపుగా 300 పైగా తెలుగువారు ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసారు.
తక్కువ సమయంలో తమ పిలుపు అందుకుని మేము సైతం అని తమ సహాయ సహకారాలు అందించిన వాలంటీర్స్ అందరికి నాట్స్ సౌత్ సెంట్రల్ కోఆర్డినేటర్ హేమంత్ కొల్ల కృతజ్ఞతలు తెలిపారు.నాట్స్ బోర్డు సభ్యులలో ఒకరైన సునీల్ పాలేరు ఈ కార్యక్రమం విజయవంతంగా చేయడంలో పాలు పంచుకున్న ఐ లెవెల్ లెర్నింగ్ సెంటర్, సిలికాన్ ఆంధ్ర మనబడి వారిని అభినందించారు.దాదాపుగా నెల రోజుల నుంచి శ్రమించి ఈ కార్యక్రమాన్ని నాట్స్ వాలంటీర్లు విజయవంతం చేశారని నాట్స్ హౌస్టన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ కాకుమాను అన్నారు.“భాషే రమ్యం , సేవే గమ్యం” అనే నాట్స్ సూత్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో నాట్స్ హ్యూస్టన్ సభ్యులు చూపిస్తున్న చొరవను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.హ్యూస్టన్ నాట్స్ కోర్ కమిటీ సభ్యులు వీరూ కంకటాల , చంద్ర తెర్లి , విజయ్ దొంతరాజు తదితరులు ఈ కార్యక్రమం విజయవంతయ్యేందుకు తమ వంతు కృషి చేసారు.

Telugu Houston Chapter, Nats, Telugu Nri Ups-

ఈ కార్యాక్రమాన్ని విజయవంతం చేయడంలో తమ సహాయసహకరణలు అందచేసిన తెలుగు భవనం, హ్యుస్టన్ తెలుగు సాంస్కృతిక కమిటీ (టీసీఏ) మరియు తెలంగాణ గ్రేటర్ హౌస్టన్ సంఘం (టీఏజీహెచ్) సభ్యులకు నాట్స్ హౌస్టన్ విభాగం తమ ఆత్మీయ కృతజ్ఞతలు తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube