నాట్స్ అమెరికా తెలుగు సంబరాల ఫండ్ రైజింగ్ కు విశేష స్పందన     2019-01-22   13:35:32  IST  Raghu V

డాలస్ లో సంబరాల కోసం మేము సైతమన్న తెలుగుప్రజలు

డాలస్, జనవరి 20: అమెరికా తెలుగు సంబరాలకు నాట్స్ విసృత్తంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో పెద్ద ఎత్తున నిర్వహించిన అమెరికా తెలుగు సంబరాల కోసం నాట్స్ డాలస్ నగరంలో ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇర్వింగ్ వేదికగా వచ్చేమే 24,25,26 తేదీల్లో నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను నిర్వహించనుంది. దీంతో స్థానికంగా ఉండే తెలుగు ప్రజలంతా ఈ సంబరాల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. డాలస్ లో నిర్వహించిన ఫండ్ రైజింగ్ కు విశేష స్పందన లభించింది.

NATS Fundraising Party In America Makes Huge Response-Nats Nri Telugu Nri News Updates

NATS Fundraising Party In America Makes Huge Response

దాదాపు 6,00,000 డాలర్ల విరాళాలను ఇచ్చేందుకు నాట్స్ సభ్యులు, తెలుగు ప్రజలు తమ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇప్పటికే 5 తెలుగు సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించిన నాట్స్ 6వ తెలుగు సంబరాలను కూడా అంతే వైభవంగా నిర్వహించేందుకు భారీ కసరత్తు చేస్తోంది. సంబరాలు ఎలా ఉంటాయనేది తెలుపుతూ అమెరికా తెలుగు సంబరాల కర్టన్ రైజర్ ఈవెంట్ జరిపారు.ఈ ఈవెంట్ లోనే ఫండ్ రైజింగ్ కూడా చేశారు.దీనికి విచ్చేసిన స్థానిక తెలుగు ప్రజలంతా ముక్తకంఠంతో సంబరాలకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

NATS Fundraising Party In America Makes Huge Response-Nats Nri Telugu Nri News Updates

నాట్స్ బోర్డు డైరక్టర్, ఫండ్ రైజింగ్ డైరక్టర్ అయిన ఆది గెల్లి ఈ కార్యక్రమానికి వచ్చిన అతిధులను పరిచయం చేశారు. ఆలాపన టీం… ఈ ఈవెంట్లో సంగీత మధురిమలు పంచింది. ఇదే వేదికపై నాట్స్ డాలస్ చాప్టర్2019-20 నాయకత్వాన్ని కూడా నాట్స్ ప్రకటించింది.

NATS Fundraising Party In America Makes Huge Response-Nats Nri Telugu Nri News Updates

డాలస్ చాప్టర్ కో ఆర్డినేటర్ గా అశోక్ గుత్తా, సెక్రటరీగా డీవీ ప్రసాద్, హెల్ఫ్ లైన్ కమిటీ చైర్మన్ గా సత్య శ్రీరామనేని, కో ఛైర్మన్ గా రవి తాండ్ర, రాజీవ్ కంభంను నియమించింది. స్పోర్ట్స్ ఛైర్మన్ గా శ్రీనివాస్ కాసర్ల, సత్య శ్రీరామనేని, మహిళా సాధికారిత ఛైర్మన్ గా కవితాదొడ్డా, వెబ్ కమిటీ ఛైర్మన్ గా శ్రీథర్ నేలమడుగుల,

NATS Fundraising Party In America Makes Huge Response-Nats Nri Telugu Nri News Updates

సోషల్ మీడియా అండ్ మార్కెటింగ్ ఛైర్మన్ గా విజయ్ కొండ, కల్చరల్ కమిటీ ఛైర్మన్ ఆర్య బొమ్మినేని, కమ్యూనిటీ సర్వీసెస్ ఛైర్మన్ గా రాజేంద్ర యనమదల కు బాధ్యతలు అప్పగించింది. ఇంకా ఈ ఈ కార్యక్రమంలో నాట్స్ తెలుగు సంబరాల కన్వీనర్ కిషోర్ కంచర్ల, నాట్స్ బోర్డు డైరక్టర్స్ .. ఆది గెల్లి, రాజేంద్ర మాదాల, అమర్ అన్నే,రాజ్ అల్లాడ, నాట్స్ ఈ.సి. నుండి బాపు నూతి, శేఖర్ అన్నే, అజయ్ గోవాడ, జ్యోతి వనం తదితరులు హాజరయ్యారు.