న్యూజెర్సీ లో నాట్స్ ఫుడ్ డ్రైవ్ కి విశేష స్పందన..

ఆకలితో ఉన్న వారికి ఆకలి తీర్చాలి ఇదే ప్రప్రధమంగా సేవ యొక్క నిర్వచనం.తిండి తరువాతే ఏదన్నా సాయం చేయాలని అంటారు అలాంటి బృహత్తర కార్యక్రమం నిర్వహించడంలో అమెరికాలో తెలుగు సంఘం అయిన నాట్స్ ఎప్పుడూ ముందు ఉంటుందని మరో సారి ప్రూవ్ చేసింది.

 Nats Food Drive 2018 In New Jersey-TeluguStop.com

అమెరికా వ్యాప్తంగా “ఒన్ మిలియన్ ఫుడ్ డ్రైవ్” అంటూ 2016 లో ప్రారంభించి.

అమెరికా వ్యాప్తంగా నాట్స్ ఇచ్చిన పిలుపు మేరకు అప్పటి నుంచీ ఇప్పటి వరకూ నాట్స్ విభాగాలు ఆచరించి చూపిస్తున్నాయి.నాట్స్ సభ్యులు మాత్రమే కాకుండా స్థానిక ప్రజలు సైతం ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు.భాషే రమ్యం.

సేవే గమ్యం అనే నినాదంతో ప్రతీ సంవత్సరం నాట్స్ ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది.ఆ సందర్భంగా నాట్స్ సేకరించిన ఫుడ్ క్యాన్స్ ని స్థానిక ఓజామన్ కేథలిక్ ఛారిటీకి నాట్స్ డోనేట్ చేసింది.

అయితే ఈ కార్యక్రమం ద్వారా టూత్ బ్రష్ లు , పేస్టులు, ఫస్ట్ ఎయిడ్ కిట్ లు తదితర నిత్యావసర వస్తువులని పిల్లలకి ఇవ్వడం జరిగిందని మోహన్ కుమార్ వెనిగళ్ళ తెలిపారు.ప్రతీ ఒక్క నాట్స్ సభ్యుడు ఈ కార్యక్రమంలో పాల్గొని భవిష్యత్త్ తరాలకి స్పూర్తిగా ఉండాలని ఆయన కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube