సెయింట్ లూయిస్ లో టిఎఎస్ తో కలసి నాట్స్ దీపావళి వేడుకలు  

సెయింట్ లూయిస్: నవంబర్:30 అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ దీపావళి వేడుకలు నిర్వహించింది.సెయింట్ లూయిస్ తెలుగు సంఘం టీఏఎస్‌తో కలిసి నాట్స్ ఈ వేడుకలను నిర్వహించింది.

TeluguStop.com - Nats Depavali Celebrations Event Held This Weekend By Nats St Luis Chapter And Tas

ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం స్మృతులను గుర్తు చేసుకుంటూ ఆయన పాడిన అద్భుతమైన పాటలను మనో బృందం ఆలపించింది.ఆన్‌లైన్ ద్వారా ఈ పాటల ప్రవాహం కొనసాగింది.

ఈ సంగీత విభావరిలో మనో తో పాటు ప్రముఖ గాయకులు పార్థసారథి, మల్లికార్జున, గాయనీ గోపికా పూర్ణిమా మధురమైన ఎన్నో తెలుగు పాటలు పాడి ప్రవాసులను అలరించారు.నాట్స్ నాయకులు డాక్టర్ సుధీర్ అట్లూరి, రమేశ్ బెల్లం, శ్రీనివాస్ మంచికలపూడి, నాగ శిష్ట్లా, నాగ సతీష్ ముమ్మనగండి, వైఎస్ఆర్‌కె ప్రసాద్, కమలాకర్ జాగర్లమూడి తదితరులు ఈ సంగీత కార్యక్రమానికి ప్రధానదాతలుగా వ్యవహారించారు.

TeluguStop.com - సెయింట్ లూయిస్ లో టిఎఎస్ తో కలసి నాట్స్ దీపావళి వేడుకలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

టి ఎ ఎస్ అధ్యక్షుడు సురేంద్ర బాచిన, తన కార్యవర్గ సభ్యులు ఈ కార్య క్రమాన్ని ముందుండి నడిపించారు.

దీపావళి వేడుకల వేళ తియ్యటి తెలుగుపాటలతో మై మరిపించినందుకు సెయింట్ లూయిస్ తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.దీపావళి సందర్భంగా ఆన్ లైన్ ద్వారా ఇలాంటి కార్యక్రమం నిర్వహించినందుకు నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ అధ్యక్షుడు శేఖర్ అన్నే లు సెయింట్ లూయిస్ చాప్టర్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.

#NATSSt.Luis #Parthasarathy #SingerGopika #Mallikarjuna

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు