ఈ నెల 20 నుంచి నాట్స్ క్రికెట్ కప్ 20 ఇంజనీరింగ్ కాలేజీల మధ్య క్రికెట్ పోటీ  

Nats Cricket Tournament,telugu Nri News Updates-

సెయింట్ లూయిస్: సెప్టెంబర్ 11: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.తెలుగునాట కూడా సేవా కార్యక్రమాలతో పాటు యువతను క్రీడల దిశగా ప్రోత్సాహించేందుకు తనవంతు సహకారం అందిస్తోంది.ఈ నెల 20వ తేదీ నుంచి 27 వరకు నాట్స్ కప్ పేరుతో గుంటూరులో క్రికెట్ పోటీలు నిర్వహించనుంది...

Nats Cricket Tournament,telugu Nri News Updates---Nats Cricket Tournament Telugu Nri News Updates

ప్రాగ్మ ఎడ్జ్ సంస్థతో కలిసి గుంటూరు దగ్గర వింజనపాడులో ఉన్న కేకేఆర్ అండ్ కేఎస్టీ కాలేజీలో ఈ పోటీలు నిర్వహిస్తోంది.విద్యార్ధుల్లో క్రీడా స్ఫూర్తిని నింపడమే లక్ష్యంగా ఈ నాట్స్ ఈ పోటీలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుందని నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి అన్నారు.

ఈ పోటీల్లో విజేతలకు 10వేల రూపాయల నగదు బహుమతి, రన్నరప్ కు రూ.7వేలు అందజేస్తామన్నారు.

Nats Cricket Tournament,telugu Nri News Updates---Nats Cricket Tournament Telugu Nri News Updates