కరోనాపై వైద్యనిపుణులచే నాట్స్ వెబినార్

అమెరికాలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ పై అవగాహన కల్పించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నడుంబిగించింది.ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక కేసులు అమెరికాలోనే నమోదు కావడంతో నాట్స్ అప్రమత్తమైంది.

 The Nats Webinar On The Pandemic Coronavirus Nats, Nats, Corona Virus, America T-TeluguStop.com

కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై నాట్స్ వైద్య నిపుణులచే వెబినార్ నిర్వహించింది.అమెరికాలో ప్రముఖ వైద్య నిపుణులు కె.వి.సుందరేశ్, డాక్టర్ మధు కొర్రపాటి కొవిడ్-19 పై ఎంత అప్రమత్తంగా ఉండాలి.? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా రాకుండా ఉంటుందనే దానిపై అవగాహన కల్పించారు.అంతే కాకుండా కరోనా పేషంట్లలో ప్రధానంగా తలెత్తుతున్న సమస్యలు ఏమిటి.? ఎలాంటి వారు మరణానికి దగ్గరవుతున్నారు.? అనే విషయాలపై కూడా వైద్య నిపుణులు తమ అనుభవాలను ఈ వెబినార్ లో పంచుకున్నారు.

ఏ మాత్రం జాగ్రత్తగా లేకున్నా అమెరికాలో పది లక్షల మందికిపైగా వచ్చే అవకాశముందని హెచ్చరించారు.ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు ఉన్నవాళ్లు.చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.నిత్యావసరాల కోసం బయటకు వెళ్లినా కూడా శుభ్రంగా చేతులు కడుక్కోనే ఇంట్లోకి రావాలని… పట్టుకునే సంచుల నుంచి కూడా జాగ్రత్తలు తీసుకురావాలని తెలిపారు.

వైరస్ ను మన ఇంట్లోకి మోసుకొస్తున్నామా…? అనే విషయాన్ని పదే పదే గుర్తుంచుకుని వ్యహారించాలని హెచ్చరించారు.కోవిడ్ బారిన పడ్డ ఒక తెలుగు బాధితుడు కూడా ఈ వెబినార్ ద్వారా తాము ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే విషయాలను తెలియ చేసారు.

దాదాపు 500 మంది తెలుగువారు ఈ వెబినార్ ద్వారా ఈ సదస్సులో పాల్గొన్నారు.కరోనాపై తమకు ఉన్న సందేహాలను వైద్య నిపుణుల ద్వారా నివృత్తి చేసుకున్నారు.

Telugu America Corona, Americatelugu, Covid, Nats, Tempa Nats-General-Telugu

కరోనా వైరస్ విసృత్తమవుతున్న ఈ తరుణంలో సామాజిక దూరం పాటిస్తూ నాట్స్ వెబినార్ నిర్వహిస్తోంది.నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డ్ కార్యదర్శి ప్రశాంత్ పిన్నమనేని, సలహాకమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ మల్లాది, డా.దుర్గారావు పరిమి, టెంపా నాట్స్ కో ఆర్డినేటర్ రాజేశ్ కాండ్రు, సెక్రటరీ సుధీర్ మిక్కిలినేని, , సుబ్బా రావు యన్నమని , నాట్స్ గ్లోబల్ టీం నుంచి విష్ణు వీరపనేని తదితరులు ఈ వెబినార్ నిర్వహాణలో తమవంతు సహాయ సహాకారాలు అందించారు.ప్రశాంత్ పిన్నమనేని ఈ వెబినార్‌కు వ్యాఖ్యతగా వ్యవహారించారు.ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ, ఈ వెబినార్ మొత్తం వీడియో తో పాటు, ప్రశ్న సమాధానాలు కూడా www.natsworld.org/webinars ద్వారా అందుబాటులో ఉంటాయని తెలియచేసారు.

నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి టాంప ఫ్లోరిడా చాప్టర్ చేసిన కృషి ని ప్రత్యేకంగా అభినందించారు.జూమ్ ద్వారా మరియు ఫేస్ బుక్ లైవ్ లో పాల్గొన్న వందలాది మందిసరైన సందర్భంలో నాట్స్ ఏర్పాటు చేసిన ఈ కార్యమాన్ని వీక్షించి, తమ అభినందనలు తెలియ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube