నాట్స్ ఆధ్వర్యంలో ఘనంగా వాలీబాల్ టోర్నమెంట్..     2018-10-10   15:27:17  IST  Surya

అమెరికాలో ఉండే కొన్ని లక్షల మంది తెలుగువారు వివిధ ప్రాంతాలలో ఉంటున్నారు..అయితే ఆయాప్రాంతాలకి దగ్గరలో కొన్ని కొన్ని తెలుగుసంఘాలని ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు కలుసుకుంటూ ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందుకుంటూ ఉంటారు..అంతేకాదు సెలవురోజుల్లో లేదా తెలుగు పండుగల సమయుంలో కలుసుకుని భారత సాంప్రదాయ ఆటలు కానీ లేదా వివిధ కల్చరర్ ఆటలు ఆడుతూ వచ్చిన సొమ్ముతో సేవా కార్యకమాలు నిర్వహిస్తూ ఉంటారు..

NATS Convention Volleyball Tournament-

ఈ క్రమంలోనే ఫిలిడెల్ఫియాలోని కింగ్ ఆఫ్ పర్షియాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) సంస్థ వాలీబాల్ టోర్నమెంట్‌ను ఎంతో ఘనంగా నిర్వహించింది. ఈ టోర్నమెంట్‌లో తెలుగు ఆటగాళ్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. అమెరికాలో తెలుగుజాతిని ఒక్కటిగా చేస్తున్న నాట్స్ తెలుగువారిలో క్రీడాస్ఫూర్తిని నింపేందుకు పలు టోర్నమెంటులు నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే ఫిలడెల్ఫియాలోని కింగ్ ఆఫ్ ఫర్షియాలో నాట్స్ వాలీబాల్ టోర్నరమెంట్ నిర్వహించింది.

NATS Convention Volleyball Tournament-

ఇదిలాఉంటే ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన నాట్స్ వైస్ చైర్మన్ శ్రీథర్ అప్పసాని ఈ టోర్నమెంటుకు విశేష స్పందన రావడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేశారు..ఈ పోటీలలో 20 టీంలు వాలీబాల్ టోర్నమెంట్‌లో పాల్గొని ఉత్సాహాంగా ఆడాయి. స్థానిక తెలుగుసంఘం టీఏజీడీవీ కూడా టోర్నమెంటుకు తన వంతు సహకారం అందించింది..

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.