యోగా,మానసిక ధృడత్వంపై నాట్స్ వెబినార్

టెంపా, ఫ్లోరిడా: ఏప్రిల్ 18: కరోనా అంతకంతకు పెరుగుతున్న ఈ తరుణంలో యావత్ ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు పెరుగుతున్నాయి.ఇది ప్రజల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతోంది.

 Nats Community, Yoga, Webinar, Tampa, Florida, Prashanth Pinnamaneni-TeluguStop.com

ఈ తరుణంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికాలో తెలుగువారికి మానసికధృడత్వం ఎలా పెంచుకోవాలి.? యోగాసనాలతో ఎలా రోగ నిరోధక శక్తిని పెంపెందించుకోవాలనే అంశాలపై వెబినార్ నిర్వహించింది.

అమెరికాలో ప్రముఖ మానసిక వైద్యురాలు డాక్టర్ శ్రీదేవి కొడాలి, యోగా నిపుణురాలు రమ జొన్నలగడ్డలు ఈ వెబినార్‌లో తెలుగువారికి ఎంతో విలువైన సూచనలు, సలహాలు అందించారు.మానసిక ఒత్తిడిని ఎలా జయించాలి.? కరోనా విజృంభణ తరుణంలో ఏదో జరిగిపోతుందనే ఆందోళన, భయం, కోపం పెరిగిపోవడం.వాటి ప్రభావం కుటుంబం పై పడటం జరిగే ప్రమాదముందని వాటిని ఎప్పటికప్పుడు నివారించేందుకు ఎలా వ్యవహారించాలనేది డాక్టర్ శ్రీదేవి కొడాలి వివరించాలి.

ముఖ్యంగా భార్య, పిల్లలతో ఎలా వ్యవహారించాలి.? పిల్లలకు తల్లిదండ్రులు ఎలాంటి విషయాలు చెప్పాలి.? వారిలో ఒత్తిడి, ఆందోళన లేకుండా ఎలా మెలగాలి అనే అంశాలపై ఆమె పలువురు తెలుగువారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.ఇక శారీరక ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి యోగాసనాలు ఈ సమయంలో ఉపకరిస్తారనేది యోగా నిపుణురాలు రమ జొన్నలగడ్డ వివరించారు.

ధ్యానం మానసిక బలాన్ని పెంచుతుందని… రోజూ కొద్ది నిమిషాలు ధ్యానం చేయడం ఉత్తమమని వివరించారు.ధ్యానం ఎలా చేయాలనేది కూడా నేర్పించారు.వీటితో పాటు తేలికపాటి యోగా ఆసనాలతో రోగ నిరోధక శక్తిని, ఊపిరితిత్తుల సామార్థ్యాన్ని ఎలా పెంచుకోవచ్చో రమ జొన్నలగడ్డ వివరించారు.

నాట్స్ బోర్డ్ ఆఫ్ డైర్టకర్ ప్రశాంత్ పిన్నమనేని ఈ వెబినార్‌కు వ్యాఖ్యతగా వ్యవహారించారు.

వెబినార్ లో పాల్గొన్న పలువురి ప్రశ్నలకు సమాధానాలందించటం లో ప్రశాంత్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.రాబోయే వారాంతాలలో మరిన్ని ప్రత్యేక కార్యక్రమాల రూపకల్పన జరుగనుకున్నట్టు ప్రశాంత్ పిన్నమనేని తెలియచేశారు.

ఈ వెబినార్ లో 300 మందికి పైగా పాల్గొన్నారని ఈ సందర్భంగా ప్రశాంత్ తెలియచేశారు.

Telugu Florida, Nats Community, Tampa, Webinar, Yoga-

మానసిక ఆరోగ్యం పై నాట్స్ టెంపా టీమ్ ఈ కార్యక్రమాన్ని రూపొందిచటం ఈ సమయంలో ఎంతో ముదావహం అంటూ నాట్స్ మాజీ చైర్మన్ డా.మధు కొర్రపాటి టెంపా టీం ని అభినందించి, మున్ముందు ఇలాంటి మరిన్ని సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని ప్రస్తుత నాట్స్ బోర్డ్ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీలను ఉత్సాహపరిచారు.

నాట్స్ టెంపాబే టీం ఏర్పాటు చేసిన ఈ వెబినార్ నిర్వహాణలో నాట్స్ బోర్డ్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ టెంపా బే చాప్టర్ అడ్వైజరీ ఛైర్ శ్రీనివాస్ మల్లాది, టెంపాబే కో ఆర్డినేటర్ రాజేష్ కాండ్రు , టెంపా బే సెక్రటరీ సుధీర్ మిక్కిలినేని, ప్రసాద్ ఆరికట్ల తదితరులు ఈ వెబినార్ నిర్వహాణ కీలకపాత్ర పోషించారు.

ఈ వెబినార్‌లో కీలకమైన సూచనలు చేసిన వైద్యులు శ్రీదేవి కొడాలి, యోగా నిపుణురాలు రమ జొన్నలగడ్డ, డాక్టర్ మధు కొర్రపాటి తదితరులకు టెంపాబే టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, వైస్ ఛైర్మన్ అరుణగంటి, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ సెక్రటరీ విష్ణు వీరపనేని, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (మీడియా) మురళీ కృష్ణ మేడిచర్ల తదితరులు ఎంతో ఉపయుక్తమైన వెబినార్‌ను ఏర్పాటు చేసినందుకు టెంపాబే టీంను ప్రత్యేకంగా అభినందించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube