ఫిలడెల్ఫియాలో ఆన్‌లైన్ వేదికగా నాట్స్ బాలల సంబరాలు

ఫిలడెల్ఫియాలో ఆన్‌లైన్ వేదికగా నాట్స్ బాలల సంబరాలు ఆట, పాటలతో అలరించిన చిన్నారులు


ఫిలడెల్ఫియా : పెన్సిల్వేనియా: డిసెంబర్:28: అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రతి యేటా ఘనంగా నిర్వహించే బాలల సంబరాలను కరోనా నేపథ్యంలో ఈ సారి ఆన్ లైన్ వేదికగా నిర్వహించింది. ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం తెలుగు బాల,బాలికల ప్రతిభా పాటవాల ప్రదర్శనకు ఆన్ లైన్ వేదికగా నిర్వహించిన బాలల సంబరాలకు అద్భుత స్పందన లభించింది.

 Nats Balala Sambaralu Held By Philadelphia Nats-TeluguStop.com

ఐదేళ్ల నుంచి పదహారేళ్ళ వయస్సు ఉన్న చిన్నారులు ఈ సంబరాల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా.

తెలుగు ఆట, పాటలతో చిన్నారులు ఈ బాలల సంబరాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు.సంప్రదాయ నృత్యాలతో పాటు, చక్కటి తెలుగుపాటలతో అందరికి సంబరాల సంతోషాన్ని పంచారు.

 Nats Balala Sambaralu Held By Philadelphia Nats-ఫిలడెల్ఫియాలో ఆన్‌లైన్ వేదికగా నాట్స్ బాలల సంబరాలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పట్టు పరికిణీల్లో తెలుగుదనాన్ని చూపెట్టారు. గానం, నృత్యం, చిత్ర లేఖనం, వ్యాసరచన, హాస్య నాటికలు ఇలా పలు విభాగాల్లో నాట్స్ బాలల్లో ప్రతిభను వెలికితీసే ప్రయత్నం చేసింది.

ఆన్ లైన్ వేదికైనప్పటికి చిన్నారులు ఎంతో చక్కగా తమ ప్రతిభను చూపెట్టారు.

నాట్స బోర్డు డైరెక్టర్ హరినాథ్ బుంగతావుల, నార్త్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ కొత్తపల్లి, ఫిలడెల్ఫియా చాప్టర్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించారు.నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని , ప్రెసిడెంట్ విజయ్ శేఖర్ అన్నే ఈ బాలల సంబరాలకు సహకారాన్ని అందించారు.ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారిని విజేతలు ప్రకటించి నాట్స్ ఆన్ లైన్ వేదికగా వారిని అభినందించింది.

నాట్స్ ఫిలడెల్ఫియా విభాగం ఈ బాలల సంబరాలను ఘనంగా నిర్వహించిన ఫిలడెల్ఫియా నాట్స్ విభాగాన్ని నాట్స్ ఛైర్మన్ శ్రీథర్ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని ప్రత్యేకంగా అభినందించారు.కరోనా తీవ్రత పెరుగుతున్న ఈ సమయంలో ఆన్‌లైన్ ద్వారా తెలుగువారిని ఏకం చేసేలా బాలల సంబరాలను నిర్వహించడం నిజంగా అభినందనీయమని నాట్స్ నాట్స్ పై చిన్నారుల తల్లిదండ్రులు అభినందనల వర్షం కురిపించారు.

#Essay #NATS #NATSBoard #Dance #Philadelphia

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు