డాల్లస్ లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు.. చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికి తీసిన పోటీలు

అమెరికాలో తెలుగుజాతికి తమ విశిష్టసేవలతో దగ్గరైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) వారి డాలస్ చాప్టర్, వరుసగా ఎనిమిదవ సంవత్సరం బాలల సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహించింది.డాల్లస్ లోని ఫార్మర్స్ బ్రాంచ్ లోగల సెయింట్ మేరీస్ చర్చ్ ఆడిటోరియం వేదికగా, దాదాపు పన్నెండు గంటల పాటు జరిగిన ఈ సంబరాలలో భారత దేశ సంస్కృతిని, పిల్లలలోని మేధస్సును ప్రోత్సహించే దిశగా పోటీలు నిర్వహించారు.

 Nats Balala Sambaralu 2018-TeluguStop.com

ఈ కార్యక్రమంలో 300 మంది బాల బాలికలు గణితం, చదరంగం, క్లాసికల్, నాన్ క్లాసికల్ సంగీతం, నృత్యం మరియు తెలుగు పదకేళి పోటీలలో అత్యుత్సాహంతో ఫాల్గొన్నారు.ఎలిమెంటరీ, మిడిల్ స్కూల్, సీనియర్ స్కూల్ పిల్లలకు విడిగా నిర్వహించిన ఈ పోటీల్లో పిల్లలు తమ వయసుకు తగ్గ ప్రతిభను చూపించారు.

సాఫ్ట్ స్కూల్స్ తరఫున గూడవల్లి మణిధర్ పిల్లలకు గణితంలో పోటీ పరీక్షలు నిర్వహించారు.USCF స్థానిక చాఫ్టర్ సహకారంతో నిర్వహించిన చదరంగం పోటీలో 80 మంది పిల్లలు పాల్గొన్నారు.స్థానిక సంగీత, నృత్య పాఠశాలల గురువులు, ప్రసిద్ధ కళాకారులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.ఈ పోటీల్లో మొదటి రెండు లేదా మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి డాలస్ నాట్స్ వారు బహుమతులు అందించారు.

విద్యార్ధుల్లో సృజనాత్మకతను పెంచేందుకు వారిని ప్రోత్సాహించేందుకు నాట్స్ బాలల సంబరాలు నిర్వహిస్తుందని నాట్స్ ఉపాధ్యక్షులు బాపు నూతి అన్నారు.నాట్స్ చేసే వివిధ సేవా కార్యక్రమాల గురించి వివరించి అందరిని భాగస్వామ్యులు కావాల్సిందిగా కోరారు.

ఇతర వక్తలు మాట్లాడుతూ ప్రవాసాంద్రుల పిల్లల కొరకు నాట్స్ చేస్తున్న సేవలను ప్రశంసించారు.

ఈ బాలల సంబరాలు కార్యక్రమానికి ముఖ్య నిర్వాహకులుగా బాపు నూతి, కిషోర్ వీరగంధం వ్యవహరించారు.డాలస్ చాప్టర్ కార్యవర్గ సభ్యులు సురేంద్ర ధూళిపాళ్ల, ప్రసాద్ దాస్తి, నాగిరెడ్డి మండల, భాను లంక, అశోక్ గుత్తా, కృష్ణ వల్లపరెడ్డి, అను అడుసుమల్లి, తేజ వాసంగి, శ్రీధర్ న్యాలమడుగుల, కిరణ్ జాలాది, శ్రీధర్ వింజమూరి, శ్రీని కాసర్ల, దేవీప్రసాద్, మోహన్ మల్లిపెద్ది, వంశీ వడ్లమూడి, విజయ్ కొండా, వెంకట్ పోలినీడు, జీవన్ గోగినేని ఇతరులు పూర్తి సహయ సహకారాలు అందించి తోడ్పడ్డారు.ఇంకా ఈ కార్య క్రమంలో నాట్స్ బోర్డు అఫ్ డైరెక్టర్స్ కిషోర్ కంచర్ల , రాజేంద్ర మాదాల, ఆది గెల్లి, జాతీయ కార్యవర్గ సభ్యులు బాపు నూతి, శేఖర్ అన్నే, కిషోర్ వీరగంధం, జ్యోతి వనం, శ్రీనివాస్ కొమ్మినేని పాల్గొని వారి తోడ్పాటుని అందించారు.

స్థానిక బిర్యానీస్ & మోర్ రెస్టారెంట్, సాఫ్ట్ స్కూల్స్.కామ్, స్పా ర్కల్స్ మరియు బావార్చి బిర్యానీ పాయింట్ ఈ కార్యక్రమ నిర్వహణకు తమ సహాయాన్ని అందించారు, స్థానిక సంస్థలైన టాంటెక్స్, టీ పాడ్, మరియు సిలికానాంధ్ర మనబడి ఈ కార్యక్రమానికి తమ వంతు సహాకారాన్ని అందించారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube