అమెరికా తెలుగు సంబరాలకు ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్న నాట్స్

డాలస్: ఏప్రిల్ 2: అమెరికా తెలుగు సంబరాలను అంబరాన్నంటేలా నిర్వహించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ముమ్మరంగా కృషి చేస్తోంది.ఇప్పటికే అనేక నగరాల్లో సంబరాల సన్నాహాక కార్యక్రమాలను నిర్వహించిన నాట్స్ డాలస్ లో ఉండే తెలుగు ప్రజలను సంబరాలకు సన్నద్ధం చేసే దిశగా అడుగులు వేస్తోంది.

 Nats America Telugu Sambaralu Exclusive Details-TeluguStop.com

డాలస్ వేదిక మే 24 నుంచి 26వరకు జరిగే ఈ తెలుగు సంబరాల్లో టెక్సాస్ లో ఉండే తెలుగువారందరిని భాగస్వాములు చేసేందుకు కృషి చేస్తోంది.మనమంతా తెలుగు- మనసంతా వెలుగు అనే థీమ్ తో

ఈ సారి సంబరాల నిర్వహిస్తున్నట్టు గురించి సంబరాల కమిటీ కన్వీనర్ కిషోర్ కంచెర్ల తెలిపారు.

కీరవాణి, మనో, ఆర్పీ పట్నాయక్ వంటి సంగీత ఉద్ధండులు తెలుగు సంబరాల్లో సందడి చేయనున్నారని నాట్స్ ఉపాధ్యక్షుడు బాపు నూతి తెలిపారు.సంగీత, సాహిత్య కార్యక్రమాలు, తెలుగుజాతి ప్రముఖులు, విశిష్ట అతిథులతో ముఖాముఖీ కార్యక్రమాలు.

పసందైన వంటకాలతో తెలుగింటి విందు భోజనాలు ఉంటాయని సంబరాల విశేషాలను సంబరాల కార్యదర్శి రాజేంద్ర మాదాల వివరించారు.తెలుగు సంబరాల కోసం 300మందికిపైగా నాట్స్ వాలంటీర్లు పని చేస్తున్నారని వారందరిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని కార్యక్రమ నిర్థేశకుడు రామ్ బండి తెలిపారు.

సంబరాల ఏర్పాట్ల పట్ల నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ సంతృప్తి వ్యక్తం చేశారు.

చిత్ర లేఖన పోటీలకు మంచి స్పందన

ఇండియాపై గ్లోబల్ వార్మింగ్ ప్రభావంపై నాట్స్ డాలస్ చాప్టర్ స్థానిక తెలుగుచిన్నారులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించింది.ఈ పోటీలకు స్థానిక తెలుగు కుటుంబాల నుంచి మంచి స్పందన లభించింది.ఈ చిత్ర లేఖన పోటీలకు నాలుగేళ్ల వయస్సు నుంచి 18 ఏళ్ల వయస్సు వరకు నాలుగు విభాగాలుగా విభజించి పోటీలు నిర్వహించారు.

వీటీలో వందలాది చిన్నారులు తమ ప్రతిభను చూపెట్టారు.తమ సృజనాత్మకతకు ప్రతిబింబించేలా చక్కటి చిత్రాలు గీశారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్త లక్ష్మి సోమంచి, సంబరాల సాంస్కృతిక సమన్వయ కర్త ఆర్య బెల్లం, సహ సమన్వయ కర్తలు చంద్రపొట్టిపాటి, చాక్స్ కుందేటి, సభ్య బృందం విజయ బండి, మాధవి ఇందుకూరి, పల్లవి తోటకూర, మాధవి లోకిరెడ్డి మరియు సంబరాల రిజిస్ట్రేషన్ కమిటీ సభ్యులు సురేంద్ర ధూళిపాళ, శ్రీధర్ విన్నమూరి, క్రీడా విభాగం నుండి శ్రీనివాస్ కాసర్ల అంకిత భావంతో పనిచేసారు.ఇంకా ఈ కార్యక్రమంలో సంబరాల కమిటీ నాయకులు విజయ శేఖర్ అన్నె (సంయుక్తాధిపతి), ఆది జెల్లి (ఉపాధిపతి), ప్రేమ్ కలిదిండి (ఉపాధిపతి), రాజేంద్ర మాదాల (కార్యదర్శి), బాపు నూతి (కోశాధికారి), మహేశ్ ఆదిభట్ల (సంయుక్త కార్యదర్శి), విజయ్ వర్మ కొండ (క్రయవిక్రయ నిర్దేశకుడు), భాను లంక (ఆతిథ్యం నిర్దేశకుడు), కిషోర్ వీరగంధం (వ్యవహారాల నిర్దేశకుడు), రామిరెడ్డి బండి (కార్యక్రమ నిర్దేశకుడు), నరసింహా రెడ్డి ఊరిమిండి (ప్రసారమాధ్యమ నిర్దేశకుడు), చినసత్యం వీర్నపు (టాంటెక్స్ అధ్యక్షుడు) తదితరులు పాల్గొన్నారు.

వీరంతా పోటీల్లో అత్యుత్తమ చిత్రాలనుగీసిన చిన్నారులకు బహుమతులు అందచేసి వారిని ప్రత్యేకంగా అభినందించారు.

ఇంకా ఈ కార్యక్రమానికి స్పాన్సర్లుగా బావర్చి ఇండియన్ క్విజీన్, శేష గోరంట్ల-రియల్టర్, బిర్యానిస్ అండ్ మోర్, స్పార్కల్స్, ప్రోగ్రామ్ స్పాన్సర్స్ టెక్ స్టార్ గ్రూప్, అవర్ కిడ్స్ మాంటిస్సొరి, తెరపీ ఫిట్, క్లౌడ్ మెల్లో, ప్రసార మాధ్యమాలైన టివి9, టివి5, దేసీప్లాజా టివి, రేడియో సురభి, ఫన్ ఏసియా రేడియో, తెలుగు వన్ రేడియోలకు నాట్స్ కృతజ్ఞతలు తెలిపింది.

నాట్స్ ఆధ్వర్యంలో టేబుల్ టెన్నిస్ పోటీలు డాలస్ లో తెలుగువారిని ఒక్కటి చేసేలా క్రీడా పోటీలు

డాలస్: ఏప్రిల్ 2: అమెరికాలో తెలుగువారిని ఏకం చేసేలా అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్న అమెరికా తెలుగు సంబరాలకు సన్నాహాకాల్లో భాగంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .డాలస్ లో టేబుల్ టెన్నిస్ పోటీలు నిర్వహించింది.దాదాపు 70మందికి పైగా తెలుగువారు ఈ టేబుల్ టెన్నిస్ పోటీల్లో పాల్గొన్నారు.స్థానిక డాలస్ టేబుల్ టెన్నిస్ ప్రాంగణంలో జరిగిన ఈ పోటీలకు స్థానిక తెలుగు వారి నుంచి మంచి స్పందన వచ్చింది.

టెన్నిస్ ఆడుతున్న తమ వారిని చూసేందుకు కుటుంబ సభ్యులు కూడా ఈ వేదికకు విచ్చేశారు.సంబరాల క్రీడా విభాగం నిర్దేశకుడు ఎన్ ఎం ఎస్ రెడ్డి, క్రీడా సమన్వయ కర్త శ్రీనివాస్ కాసర్ల, నాట్స్ నాయకత్వ బృందం సభ్యులు బాపు నూతి, రాజేంద్ర మాదాల, ప్రేమ్ కలిదిండి విచ్చేసిన క్రీడా ప్రియులకు స్వాగతం పలికారు.

ఆటల పోటీల నియమ నిబంధనలు, క్రీడావిభాగం ముఖ్యోద్దేశాలను వివరించారు.అమెరికా సంబరాల క్రీడా విభాగం అత్యున్నత ప్రమాణాలతో, ఎంతో ఆసక్తిదాయకమైన వాతావరణంలో ఈ పోటీలను నిర్వహించింది.చివరి క్షణం వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోటీలను పోటీ దారులు, ప్రేక్షకులు కొనియాడారు.

తెలుగు వారందరినీ ఒక వేదికపై కలిసి చిన్నారులకు, యువతకు మన సంస్కృతిని పరిచయం చెయ్యాలని, తెలుగువారి ఐక్యతకు కృషి చేయాలని, ఇలాంటి ఆటలు సుహృద్భావాన్ని పెంచడానికి సదవకాశమని నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ అధిపతి శ్రీనివాస్ గుత్తికొండ తమ సంయుక్త సందేశంలో పేర్కొన్నారు.ఈ పోటీల నిర్వహణకు, రాబోవు సంబరాలకు సహా ఆతిథ్యం అందించడం చాలా సంతోషంగా ఉందని టాంటెక్స్ అధ్యక్షుడు చినసత్యం వీర్నపు తన సందేశంలో పేర్కొన్నారు.

6వ అమెరికా సంబరాల నాయకత్వం బృందం ఈ టేబుల్ టెన్నిస్ పోటీదారులకు విజేతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి.సంబరాలకు రావాలనిఆహ్వానించింది.సంబరాల కమిటీ కన్వీనర్ కిశోర్ కంచెర్ల, విజయ శేఖర్ అన్నె ( సంయుక్తాధిపతి), ఆది జెల్లి (ఉపాధిపతి), ప్రేమ్ కలిదిండి (ఉపాధిపతి), రాజేంద్ర మాదాల (కార్యదర్శి), బాపు నూతి (కోశాధికారి), మహేశ్ ఆదిభట్ల (సంయుక్త కార్యదర్శి), విజయ్ వర్మ కొండ (క్రయవిక్రయ నిర్దేశకుడు), భాను లంక (ఆతిథ్యం నిర్దేశకుడు), కిషోర్ వీరగంధం (వ్యవహారాల నిర్దేశకుడు), రామిరెడ్డి బండి (కార్యక్రమ నిర్దేశకుడు), చినసత్యం వీర్నపు (టాంటెక్స్ అధ్యక్షుడు) తదితరులు పోటీదారుల క్రీడాస్ఫూర్తిని ప్రత్యేకంగా అభినందించారు.

విజేతలకు సంబరాల వేదికపై బహుమతులు అందించనున్నారు.

క్రీడావిభాగం నుండి బాపు నూతి, రాజేంద్ర మాదాల, ఎన్ ఎం ఎస్ రెడ్డి, ప్రవీణ్ పోలిశెట్టి, శ్రీనివాస్ కాసర్ల, మహేశ్ ఆదిభట్ల, చినసత్యం వీర్నపు టేబుల్ టెన్నిస్ పోటీలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు.రాబోవు సంబరాలను జయప్రదం చేయవలసినదిగా తెలుగువారికి పిలుపు నిచ్చారు.కార్యక్రమానికి స్పాన్సర్లుగా వ్యవహరించిన బావర్చి ఇండియన్ క్విజీన్, శేష గోరంట్ల-రియల్టర్, బిర్యానిస్ అండ్ మోర్, స్పార్కల్స్, ప్రోగ్రామ్ స్పాన్సర్ టెక్ స్టార్ గ్రూప్, అవర్ కిడ్స్ మాంటిస్సొరి, తెరపీ ఫిట్, క్లౌడ్ మెల్లో, ప్రసార మాధ్యమాలైన టీవి9, టివి5, దేసీప్లాజా టివి, రేడియో సురభి, ఫన్ ఏసియా రేడియో, తెలుగు వన్ రేడియోలకు కృతజ్ఞతలు తెలిపారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube