అక్కడ కట్టుకున్న భర్తలే తమ భార్యలతో వ్యభిచారం చేయిస్తారట…  

మామూలుగా పొట్ట కూటి కోసం కొంత మంది మహిళలు వ్యభిచారం చేస్తున్న సందర్భాలను మన నిత్య జీవితంలో అప్పుడప్పుడు చూస్తుంటాం, వింటుంటాం. కానీ ఆ ప్రాంతంలో మాత్రం కట్టుకున్న భర్తలే డబ్బు కోసం తమ భార్యల దగ్గరికి విటులను తెచ్చి మరి దగ్గరుండి వ్యభిచారం చేయిస్తున్నారనే విషయం తెలిస్తే ఒక్కసారిగా అవాక్కవుతారు.

TeluguStop.com - Natpurwa Red Light Area In Uttar Pradesh News

పూర్తి వివరాల్లోకి వెళితే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో నట్ పూర్వ అనే ఒక గ్రామం ఉంది.అయితే ఈ గ్రామంలో పెళ్లయిన తర్వాత భార్య పై మోజు తీరిపోయినటువంటి కొందరు భర్తలు తమ భార్యలతో వ్యభిచారం చేయిస్తున్నారు.

 దీంతో కొందరు డబ్బు కోసం ఇదే వృత్తిగా చేసుకొని జీవిస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే తమ భార్యల దగ్గరికి విటులను దగ్గరుండి తీసుకొస్తారట.

TeluguStop.com - అక్కడ కట్టుకున్న భర్తలే తమ భార్యలతో వ్యభిచారం చేయిస్తారట…-General-Telugu-Telugu Tollywood Photo Image

అంతేకాక ఇందుకుగాను గంటకి 2 వేల రూపాయల నుంచి 25 వేల రూపాయల వరకు ధరలు కూడా నిర్ణయిస్తారట.అక్కడ ఉన్నటువంటి కొందరు మహిళలను ఈ విషయంపై విచారించగా గత వంద సంవత్సరాలుగా తమ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు డబ్బు కోసం వ్యభిచారం చేయడానికి అలవాటుపడిపోయారని దీంతో తమకు వ్యభిచారం తప్ప మరే ఇతర పనులు తెలియవని అందువల్లనే తమ పొట్ట కూటి కోసం వ్యభిచారం చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

అయితే ఉత్తర ప్రదేశ్ పొరుగు రాష్ట్రమైన మధ్యప్రదేశ్ లో కూడా వ్యభిచార గ్రామాలు చాలానే ఉన్నాయి.అయితే ఇందులో శివపురి అనే ప్రాంతం లో మహిళలను రోజు, నెల మరియు సంవత్సరం ఇలా భర్తలు తమ భార్యలని డబ్బు కోసం ఇతర వ్యక్తులకి డేకు ఇస్తుంటారు.

దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందిస్తూ ఇలాంటి వ్యభిచార గ్రామాలను గుర్తించి సమూలంగా నిర్మూలించడంతో పాటూ అక్కడి ప్రజలకు డబ్బు సంపాదించుకునేందుకు పని కల్పించాలని కోరుతున్నారు.

#RedLight #NatpurwaRed #NatpurwaRed

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Natpurwa Red Light Area In Uttar Pradesh News Related Telugu News,Photos/Pics,Images..