మూడు వారాల తర్వాత బిగ్‌ బాస్‌లో సరైన నిర్ణయం.. అయినా నానిపై విమర్శలు     2018-09-17   11:16:30  IST  Ramesh P

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 ముగింపు దశకు చేరుకుంది. తాజాగా నిన్నటి ఆదివారం అమిత్‌ షా ఎలిమినేట్‌ అయ్యాడు. గత కొన్నాళ్లుగా బిగ్‌బాస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. బిగ్‌బాస్‌ గేమ్‌ ఫేయిర్‌గా జరగడం లేదని, అన్ని అవకతవకలు జరుగుతున్నాయి అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తు వస్తున్నారు. ముఖ్యంగా గత మూడు వారాలుగా బిగ్‌బాస్‌ ఎలిమినేషన్‌ పక్రియ ఏమాత్రం సజావుగా సాగడం లేదని, అసలు ప్రేక్షకులు వేస్తున్న ఓట్లు పరిగణలోకి తీసుకోకుండా ఎలిమినేషన్స్‌ చేస్తున్నారు అంటూ ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

గత రెండు వారాలుగా శ్యామల మరియు నూతన్‌ నాయుడుల ఎలిమినేషన్‌ పక్రియను చూస్తే ప్రేక్షకులు అదే అనుమానంను వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో తాజాగా బిగ్‌ బాస్‌ నిర్వహకులు కాస్త జాగ్రత్త పడి ఈసారి తక్కువ ఓట్లు వచ్చిన అమిత్‌ను ఎలిమినేట్‌ చేసినట్లుగా సోషల్‌ మీడియాలో టాక్‌ వినిపిస్తుంది. తెలుగు బిగ్‌ బాస్‌ ఫెయిర్‌ గేమ్‌ కాదు అంటూ ఆమద్య నూతన్‌ నాయుడు ఎలిమినేట్‌ అయిన సమయంలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి.

అమిత్‌ కంటే చాలా ఎక్కువ ఓట్లు నూతన్‌ నాయుడుకు వచ్చినా కూడా ఆయన్ను ఎలిమినేట్‌ చేయడంకు కారణం ఏంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం అయ్యింది. ఇలాంటి సమయంలో తాజాగా అమిత్‌ను ఎలిమినేట్‌ చేయడంతో కాస్త ఫైర్‌ తగ్గిందని చెప్పుకోవచ్చు. బిగ్‌బాస్‌ ప్రేక్షకులు అమిత్‌ వల్ల పెద్దగా ఎంటర్‌టైన్‌ అయ్యింది లేదు. కాని ఆయన గత కొన్నాళ్లుగా ఇంట్లో అందరితో సమాన దూరం పాటిస్తూ, వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.

Natizens Trolls On Nani Bigg Boss telugu 2 House-Bigg Boss Telugu 2,Elimination For This Week,Nani,Natizens Trolls On Nani Bigg Boss Telugu 2 House,telugu Big Boss

తాజాగా వారాంతం ఎపిసోడ్‌లో నాని వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మొన్నటి ఎపిసోడ్‌లో కౌశల్‌ను టార్గెట్‌ చేయడంతో నానిపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తనీష్‌లో కనిపించని తప్పులు కేవలం కౌశల్‌పైనే ఎందుకు నాని తప్పులు ఎత్తి చూపే ప్రయత్నం చేస్తాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాని ఇప్పటికైనా తన పద్దతి మార్చుకోవాలంటూ కౌశల్‌ ఆర్మీ హెచ్చరిస్తున్నారు