మెక్సికో గోడ నిర్మాణం: పురాతన అమెరికన్ల సమాధుల పేల్చివేత, మండిపడుతున్న డెమొక్రాట్లు

మెక్సికో గుండా తమ దేశంలోకి అక్రమం ప్రవేశిస్తున్న వలసదారులకు అడ్డుకట్ట వేసేందుకు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ గోడను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.దీని నిర్మాణం కారణంగా అనేక వారసత్వ కట్టడాలు, ప్రకృతి సంపద కనుమరుగవుతూ వస్తున్నాయి.

 Native American Burial Sites Blown Up For Us Mexico Border Wall-TeluguStop.com

తాజాగా ఆరిజోనాలోని తొలి అమెరికన్లు, ఆదిమ తెగలకు చెందిన సమాధులను నిర్మాణ సిబ్బంది పేల్చివేసినట్లుగా చట్టసభ సభ్యులు, గిరిజన నాయకులు ఆరోపిస్తున్నారు.

టక్సన్‌కు పశ్చిమంగా 185 కిలోమీటర్ల దూరంలో యునెస్కో గుర్తించిన ఆర్గాన్ పైప్ కాక్టస్ నేషనల్ మాన్యుమెంట్‌లో మంగళవారం పేలుడు సంభవించినట్లు అధికారులు ధ్రువీకరించారు.

ఈ ఆర్గాన్ పైప్‌ను 1976లో ఐక్యరాజ్యసమితి మాన్యుమెంట్ హిల్‌గా ప్రకటిస్తూ.అంతర్జాతీయ బయోస్పియర్‌ రిజర్వ్‌గా పేర్కొంది.ఇది ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్న సోనరన్ ఎడారి పర్యావరణ వ్యవస్థకు ఒక ఉదాహరణగా నిపుణులు చెబుతారు.

Telugu American, Burial Sites, National, Nativeamerican, Telugu Nri, Unesco, Mex

ఈ నేషనల్ పార్క్ గుండా 43 మైళ్ల పొడవుతో 30 అడుగుల ఎత్తైన ఉక్కు గోడను అధికారులు నిర్మిస్తున్నారు.దీనిపై డెమొక్రాట్ కాంగ్రెస్ సభ్యుడు రౌల్ గ్రిజల్వా మండిపడ్డారు.గోడ నిర్మాణానికి సంబంధించి టోహోనో ఓయోధమ్‌ నేషన్‌ను సంప్రదించడంలో ఫెడరల్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

మెక్సికోతో 400 మైళ్ల సరిహద్దును పంచుకునే ఈ ప్రాంతాన్ని అనుకుని వున్న ఈ జిల్లా ఉంటుంది.ఇక్కడి సహజ వనరులపై ఏర్పాటు చేసిన హౌస్ కమిటీ ఛైర్మన్‌గా గ్రిజల్వా వ్యవహరిస్తున్నారు.

Telugu American, Burial Sites, National, Nativeamerican, Telugu Nri, Unesco, Mex

పేలుడు సంభవించిన ప్రాంతంలో ఓయోధామ్ ప్రజలు అక్కడ తమకు ప్రత్యర్ధులుగా ఉన్న అపాచీ తెగకు చెందిన యోధులను ఖననం చేశారు.తమ పూర్వీకులు విశ్రాంతి తీసుకునే చోటును డైనమైట్‌తో పేల్చివేయడంపై స్థానిక గిరిజనులు మండిపడుతున్నారని గ్రిజిల్వా తెలిపారు.2015 అధ్యక్ష ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ట్రంప్ సరిహద్దు గోడ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.ఈ ఆర్గాన్ పైప్‌లైన్ కారణంగా 22 పురాతన ప్రదేశాలు నాశనమయ్యే అవకాశం ఉందని ఒక నివేదిక చెబుతోంది.2005 ఆర్ఈఏఎల్ ఐడీ చట్టం ద్వారా అమెరికా జాతీయ భద్రతా విధానానికి భంగం కలిగించే చట్టాలను రద్దు చేసే హక్కు ఫెడరల్ ప్రభుత్వానికి కల్పించబడింది.దీని సాయంతో ట్రంప్ యూఎస్-మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కోగలుగుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube