గల్ఫ్ ఉద్యోగాల జాతీయకరణ...గాల్లో దీపంలా ప్రవాస భారతీయుల ఉద్యోగాలు..!!

ఎన్నో ఏళ్ళుగా గల్ఫ్ లో ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే స్థిరపడిపోయిన ఎంతో మంది భారతీయ ఉద్యోగాల మెడపై ఉద్యోగాల జాతీయకరణ కత్తి వేలాడుతోంది.ఏ క్షణంలోనైనా ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది.

 Nationalization Of Gulf Jobs Jobs For Expatriate Indians Like A Lamp In The Gall-TeluguStop.com

ఇప్పటి వరకూ గల్ఫ్ లో చిన్న చిన్న ఉద్యోగాలపై స్థానికులు పెద్దగ శ్రద్ద చూపలేదు దాంతో విదేశీయులకు ఉద్యోగాల కల్పనా చాలా సులువుగా జరిగింది.కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి, ఎంతో మంది స్థానికులు తాము కూడా విదేశీయులు చేసే ఉద్యోగాలు చేస్తామని ముందుకు రావడంతో ఉద్యోగాల జాతీయకరణ తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.

విదేశీయులను ఉద్యోగాల నుంచీ తప్పించి తమకు హక్కుగా రావాల్సిన ఉద్యోగాలు ఇవ్వాలంటూ ప్రభుత్వం ముందు ప్రజలు వినతులు ఇవ్వడంతో ప్రభుత్వం కూడా ఈ దిశగా అడుగులు వేయనున్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఒమన్, సౌదీ అరేబియా దేశాలు రెండూ ఉమ్మడిగా ప్రవైటు రంగంలో విదేశీయులను తొలగించేందుకు ఇప్పటి నుంచే కసరత్తులు మొదలు పెట్టాయి.

అందులో భాగంగానే ఎన్నో నిభందనలు పెడుతూ ప్రవాస ఉద్యోగులలో ఆందోళన కలిగిస్తున్నాయి.

ముఖ్యంగా ఈ దేశాలు ఉద్యోగాల నిమ్మితం వెళ్ళే వారిలో అత్యధికంగా భారతీయులు ఉండగా తెలుగు రాష్ట్రాలకు చెందినా వారు కూడా లెక్కకు మించి ఉన్నారు.

అంతేకాదు ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరి ఉద్యోగాలను అక్కడి ప్రభుత్వాలు తొలగించగా వారిలో అత్యధికంగా 25 ఏళ్ళు పై బడి పనిచేసిన వారిగా తెలుస్తోంది.ఏళ్ళ తరబడి అక్కడి ప్రభుత్వాలను నమ్ముకుని పనిచేస్తున్న వారిని సైతం నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాల నుంచీ తలగించి పంపేయడంతో ఎంతో మంది భారత ప్రవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా వీసా లేబర్ కార్డుల ఫీజులు భారీగా పెంచడంతో అక్కడ ప్రవాసులకు ఉద్యోగాలు కల్పించే సంస్థలకు తలకు మించిన భారం అవడంతో ఆయా సంస్థలు కూడా ఇప్పుడు విదేశీ ఉద్యోగుల పట్ల విముఖంగా ఉన్నాయని అంటున్నారు.ఏది ఏమైనా ఉద్యోగాల జాతీయకరణం పూర్తి స్థాయిలో జరిగితే తీవ్రంగా నష్టపోయేది భారతీయులు మాత్రమేనని ఈ విషయంలో ప్రభుత్వాలు ప్రవాసుల ఉద్యోగాలకు భద్రతా ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రవాస సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube