ఏపీ ప్రభుత్వంపై సీరియస్ అయిన మహిళా కమిషన్  

National Women Commission Chairman Rekha Sharma Tweet-ap Politics,chairman Rekha Sharma,national Women Commission,tweet

అమరావతిలో ఆందోళనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.ఇక వందల సంఖ్యలో మహిళలు అమరావతి, విజయవాడ ప్రాంతాలలో ప్రభుత్వానికి వ్యతిరేఖంగా రాజధానిగా మద్దతుగా ఆందోళనలు చేస్తున్నారు.

National Women Commission Chairman Rekha Sharma Tweet-ap Politics,chairman Rekha Sharma,national Women Commission,tweet తాజా తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ..ఎలక్షన్ రిజల్ట్స-National Women Commission Chairman Rekha Sharma Tweet-Ap Politics Chairman National Tweet

ఇక అధికార పార్టీ వైసీపీ ఆందోళన చేస్తున్న వారిని పోలీసు బలగాలతో అణచివేసే ప్రయత్నం చేస్తుంది.ఇక అమరావతి ఆందోళనని ఎలా అయిన డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఆందోళనలో పాల్గొన్న రాజధాని రైతులు, మహిళలని అరెస్ట్ లు చేస్తుంది.

మరో వైపు అన్ని ప్రాంతాలలో విద్యార్ధులు ఉద్యమంలో పాల్గొనకుండా ముందుగానే ఆయా కళాశాలలో హెచ్చరికలు ఇచ్చినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే విజయవాడలో దుర్గమ్మ మొక్కు చెల్లించుకోవడానికి వెళ్ళిన మహిళలని పోలీసులు విచక్షణారహితంగా కొట్టి హింసించి వ్యాన్ లలో ఎక్కించి అరెస్ట్ చేశారు.

ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది.జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ ఈ విషయం మీద ట్విట్టర్ వేదికగా స్పందించారు.

సుమారు వంద మంది మహిళలని అన్యాయంగా దాడి చేసి, నిర్భందించి సాయంత్రం ఆరు గంటల తర్వాత కూడా పోలీసులు విడిచిపెట్ట లేదు.అసలు మహిళల మీద ఆ స్థాయిలో ఎందుకు దాడి చేసారో అనే విషయం 24 గంటల్లోగా ఏపీ డీజీపీ సమాధానం చెప్పాలి.

అలాగే ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై బాద్యత వహించి మీ పోలీసులకి చట్టాన్ని గుర్తు చేయండి లేదంటే మేము కల్పించుకోవాల్సి వస్తుంది అంటూ హెచ్చరించారు.అయితే రాజధాని ఆందోళనని అసలు లెక్క చేయకుండా ప్రభుత్వమే అక్కడి రైతులు, మహిళల మీద దాడి చేసే అణచివేసే ప్రయత్నం చేస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

మహిళా కమిషన్ కి జగన్ ప్రభుత్వం ఎం సమాధానం చెబుతుంది అనేది ఇప్పుడు చూడాలి.

తాజా వార్తలు