ఛీ..ఛీ.. మలం మ్యూజియం.. ఎలా చూస్తారో..

మనకు మ్యూజియం అంటే గుర్తొచ్చేది.పురాతన వస్తువులు, చిత్రాలు, శిల్పాలు, గడియారాలు.

 National Poo Museum In   South England Malam ,mussieun, Viral Latest, News Viral-TeluguStop.com

ఇవన్నీ బోర్ కొట్టాయేమో.అందుకే కొత్తరకం మ్యూజియాలను ఏర్పాటు చేస్తున్నారు.

కార్ల మ్యూజియం, సంగీత వాద్యాల మ్యూజియం, పెయింటింగ్ మ్యూజియం వంటి మ్యూజియాలు ఏర్పాటు చేస్తుంటారు.అయితే ఇంకా వెరైటీతో మ్యూజియాలను నెలకొల్పుతున్నారు.

జనాలను ఆకర్షించేందుకు కొత్త ఐడియాలతో రూపొందిస్తున్నారు.అలాంటి మ్యూజియాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి.

అయితే ఇప్పుడు రెండు మ్యూజియాల గురించి చెప్పుకుందాం.వాటి గురించి వింటే.

ఛీ.ఛీ.ఇలాంటి మ్యూజియాలు కూడా ఉంటాయా అనుకుంటారు.

నేషనల్ పూ మ్యూజియం

:

అత్యంత చెత్త మ్యూజియాల్లో ఒకటి నేషనల్ పూ మ్యూజియం.ఇది సౌత్ ఇంగ్లండ్ లోని ఐల్ ఆఫ్ వైట్ ప్రాంతంలో ఉంది.2016లో ఈ మ్యూజియం ప్రారంభమైంది.ఇందులో మానవ మలాన్ని ప్రదర్శనకు ఉంచుతారు.ఎప్పుడో చనిపోయిన వారి మలంతో పాటు బతికి ఉన్న వారి మలం కూడా ఇక్కడ ఉంటుంది.అయితే ఆ మలంలో దుర్వాస ఉండదు.అందుకోసం మలంలోని తడిని తీసేసి రసాయనాలు కలుపుతారు.

ఆ మలాన్ని ఎవరూ తీసుకుపోకుండా భద్రపరుస్తారు.మనిషి మనుగడలో మలం కీలక పాత్ర పోషిస్తుందని, దీనిపై ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయని నిర్వాహకులు అంటున్నారు.

అపోహలను తొలగించేందుకు మలం మ్యూజియం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.ఇక్కడ జంతువుల పెంట కూడా ప్రదర్శనకు ఉంచుతారు.

టాయిలెట్ థీమ్ పార్క్

:

Telugu Korea, Latest, Malam, Mussieun, Nationalpoo, Seoul-Latest News - Telugu

ఇక రెండోది టాయిలెట్ థీమ్ పార్క్.అంటే కాలకృత్యాల మ్యూజియం.ఇది దక్షిణ కొరియా రాజధాని సియోల్ దగ్గర సువాన్ నగరంలో ఉంది.ఉదయం లేచి మనం టాయిలెట్లలో చేసే పనులన్నీ ఈ మ్యూజియంలో కళాత్మకంగా ప్రదర్శిస్తుంటారు.ఇది ప్రపంచంలోనే తొలి టాయిలెట్ థీమ్ పార్క్.ఈ మ్యూజియంలో మూత్రం పోస్తున్న, మల విసర్జన చేస్తున్న శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.

ఈ మ్యూజియాన్ని వేల మంది సదర్శిస్తుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube