మళ్లీ మోడీనే కోరుకుంటున్నారుగా..!  

National Medias Conduct Mood Of Nation Survey-media

ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు రెండు కలిసి మూడ్‌ ఆఫ్‌ నేషన్‌ అనే సర్వేను నిర్వహించడం జరిగింది.ఈ సర్వేలో దేశ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు.తమ రాజకీయ నాయకుల గురించి ఏమనుకుంటున్నారు.వారికి కావాల్సిన ప్రధాని ఎవరు అనే విషయాలపై సర్వే నిర్వహించగా ఆసక్తికర ఫలితాలు వచ్చాయి.

National Medias Conduct Mood Of Nation Survey-media -National Medias Conduct Mood Of Nation Survey-Media

ఈ సర్వేలో నేషన్‌ మూడ్‌ అంతా కూడా మళ్లీ ప్రధాని మోడీనే అవ్వాలంటూ ఉంది.దేశ ప్రజలకు ఆయన మాత్రమే సరైన పాలన ఇవ్వగలడు అనేది చాలా మంది నమ్మకంగా తెలుస్తోంది.

దాదాపుగా పాతిక వేల మందిని ఈ సర్వేలో భాగస్వామ్యం చేసిన సదరు మీడియా సంస్థలు మోడీకే పట్టం కట్టాలని ప్రజలు అనుకుంటున్నారు అంటూ సర్వేలో తేల్చి చెప్పింది.

మొత్తం ఓట్లలో మోడీకి 53 శాతం ఓట్లు వచ్చాయి.

వందలో 53 శాతం మంది మళ్లీ మోడీ ప్రధాని అవ్వాలంటూ కోరుకున్నారు.ఇక రాహుల్‌ గాంధీ ప్రధాని అవ్వాలని కోరుకునే వారు కేవలం 13 శాతం మంది మాత్రమే కోరుకుంటున్నారు.

ఇక మోడీ కాకుండా సోనియా గాంధీ ప్రధానిగా రావాలంటూ 7 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇక 4 శాతం మంది భవిష్యత్తు ప్రధాని అమిత్‌ షా అయితే బాగుంటుందనే అభిప్రాయంను వ్యక్తం చేశారు.

మొత్తానికి నేషన్‌ మూడ్‌ అంతా కూడా బీజేపీ వైపే ఉంది అంటూ ఆ పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మరో వైపు కాంగ్రెస్‌ పార్టీ ఈ సర్వేను కొట్టి పారేస్తోంది.

తాజా వార్తలు

National Medias Conduct Mood Of Nation Survey-media Related....