కియా తరలింపు ఖాయం అంటా

ఏపీలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా తమ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత కియా కంపెనీని ఇబ్బందులు పెడుతున్నారని, దాంతో కియా కంపెనీ తమిళనాడుకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్లుగా ఒక ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలో కథనం వచ్చింది.

 National Media Print The Story About Kia Shift In Tamilanadu-TeluguStop.com

ఆ మీడియా సంస్థ కథనంకు ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడేఎక్కింది.ఎలాగూ కొత్త కంపెనీలను తీసుకు రాలేరు, కనీసం ఉన్న కంపెనీలను కూడా నిలుపుకోలేరా అంటూ వైకాపా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి.

ఈ నేపథ్యంలో కియా కంపెనీ మరియు ప్రభుత్వం కూడా కియా కంపెనీ వెళ్లడం లేదంటూ ప్రకటించారు.ఆ రెండు ప్రకటనలతో కాస్త పరిస్థితి అదుపులోకి వచ్చినట్లుగా అనిపించినా కూడా మళ్లీ మొదటికి వచ్చింది.

కియా తరలింపు విషయమై తాము ప్రచురించిన కథనం నిజమే అని, అందులో ఎలాంటి అనుమానం లేదు అంటూ మరోసారి ఆ మీడియా సంస్థ పేర్కొంది.తమకు ఉన్న సమాచారం ప్రకారం కియా తరలింపు త్వరలోనే ఉంటుందని అంటున్నారు.

ఈ వివాదం ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది.కియా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకుంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube