బీజేపీతో వైసీపీ రహస్య ఒప్పందం... జాతీయ మీడియా అల్లిన కథనం...  

ఏపీలో బీజేపీ, వైసీపీ మధ్య రహస్య పొత్తు ఉందని స్టింగ్ ఆపరేషన్ లో బయటపెట్టిన నేషనల్ మీడియా. .

  • ఏపీలో ఎన్నికల జోరు మొదలైంది. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ రెండు ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నాయి. అయితే ఈ ఎన్నికలలో ఇప్పటికే టీడీపీ తన మొదటి జాబితా అభ్యర్ధులని ప్రకటించింది. మరో వైపు వైసీపీ కూడా అభ్యర్ధుల ప్రకటనకి సిద్ధం అయ్యింది. జనసేన పార్టీ కూడా మొదటి జాబితాలో భాగంగా ముప్పై రెండు మందితో కూడిన అభ్యర్ధుల జాబితాని ప్రకటించింది. ఇదిలా ఉంటె జాతీయ చానల్ టైమ్స్ నౌ తాజాగా స్టింగ్ ఆపరేషన్ అంటూ వైసీపీపై ఓ కథనం ప్రచారం చేసింది.

  • ఇందులో వైసీపీ పార్టీకి చెందిన కీలక నేత ఒకరు తమతో మాట్లాడినట్లు చూపిస్తూ, వైసీపీ, బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకుందని, అందులో భాగంగా బీజేపీ పోటీ చేసే స్థానాలలో వైసీపీ బలహీనమైన అభ్యర్ధులని బరిలో దించుతుంది అంటూ ప్రచారం చేస్తుంది. దీనిని వెనకుండి నడిపిస్తుంది అంతా విజయ్ సాయి రెడ్డి అని కూడా అందులో పేర్కొన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఏపీలో ఎ విధంగా చూసుకున్న బీజేపీని గెలిపించే స్థితిలో ప్రజలు లేరు. ఇలాంటి వేళ వైసీపీ బలహీన అభ్యర్ధులని నిలబెట్టిన ప్రయోజనం ఉండదు. ఈ విషయాన్ని జాతీయ మీడియా ప్రస్తావించకపోవడం గమనార్హం.