జగన్ పరువు జాతీయ స్థాయిలో ఇలా పోతోందా ?  

National Media Against To Jagan - Telugu Decisions, National Media, , Political News, Ys Jagan, Ysrcp

జగన్ పరిపాలన పై ఏపీ ప్రజలు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.జగన్ వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు, ప్రజాకర్షక పథకాలు ఎన్నో రికార్డు స్థాయిలో ప్రవేశపెట్టి సంచలనం సృష్టించారు.

National Media Against To Jagan

పాదయాత్ర సమయంలో జగన్ తీసుకున్న నిర్ణయాల కారణంగా మెజార్టీ ప్రజలు వైసీపీ ప్రభుత్వం పై సానుకూలంగా ఉన్నా… అదే స్థాయిలో విమర్శలు కూడా జగన్ ప్రభుత్వం ఎదుర్కుంటోంది.ముఖ్యంగా జగన్ తీసుకున్న నిర్ణయాలు, కక్షసాధింపు ధోరణి పై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.

ఇక జగన్ కు అనుకూలంగా కొన్ని మీడియా సంస్థలు ఏపీలో కథనాలు ప్రచారం చేస్తుండగా, టీడీపీ అనుకూల మీడియా గా పేరు పొందిన కొన్ని పత్రికలు, ఛానెల్స్ జగన్ పాలనను తీవ్రస్థాయిలో తప్పు పడుతున్నాయి.

ఏపీ ప్రజలకు జగన్ అనుకూల, వ్యతిరేక మీడియా ఏంటి అనేది స్పష్టంగా తెలియడంతో దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు.

కానీ జాతీయ స్థాయిలో చూసుకుంటే జగన్ పరిపాలన పై పెదవి విరుస్తూ జాతీయ మీడియా కథనాలకు ఇవ్వడం ,జగన్ తొందరపాటు నిర్ణయాలు, వేధింపుల కారణంగా అభివృద్ధిలో వెనుకబడడంతో ప్రజలు సంతృప్తిగా లేరు అనే విధంగా కథనాలు ప్రచారం చేస్తుండడంతో జగన్ పరువు జాతీయ స్థాయిలో పోతోంది.ఏపీలో జగన్ పరిపాలనను తుగ్లక్ పరిపాలనగా విశ్లేషిస్తూ ఆయనపై కథనాలు ప్రచారం చేస్తున్నారు.

ఇక ఫైనాన్షియల్ మ్యాగజైన్స్ అయితే జగన్ నిర్ణయాల వల్ల ఎన్ని లక్షల కోట్ల నష్టం వస్తుందో, భావితరాలు ఎంతగా నష్టపోతున్నాయో వివరిస్తూ పెద్ద ఎత్తున కథనాలు ప్రచారం చేస్తున్నాయి.దీంతో ఏపీ పరువు జాతీయ స్థాయిలో బజారున పడుతోంది.జాతీయ స్థాయిలో మీడియా వ్యవహారాలను చూసుకునేందుకు ఇప్పటికే జగన్ నాలుగు లక్షలు జీతం తో దేవులపల్లి అమర్ అనే సలహాదారు నియమించుకున్నా ఈయన జగన్ పై వ్యతిరేక కథనాలు రాకుండా చూసుకోవడంలో విఫలమవుతున్నారు.

జగన్ విషయంలో జాతీయ మీడియా చాలా ఆగ్రహం గానే ఉన్నట్లుగా అవి ప్రచారం చేసే కథనాలను బట్టి అర్థమవుతోంది.

గతంలో జగన్ తో సన్నిహితంగా ఉన్న కొన్ని జాతీయ మీడియా సంస్థలు కూడా ఇప్పుడు జగన్ పరిపాలన విశ్లేషిస్తూ తుగ్లక్ పాలన అంటూ ప్రచారం చేస్తున్నాయి.ఈ పరిణామాలు జగన్ శిబిరంలో కలవరం పుట్టిస్తున్నాయి.

జాతీయ మీడియా ఈ విధంగా ప్రచారం చేస్తే అన్ని రాష్ట్రాల్లోనూ తమ పరువు పోతుందని జగన్ ఆవేదనగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే జాతీయ మీడియా లో వ్యతిరేకత రాకుండా ఉండేందుకు ఏం చేయాలి అనే దానిపై జగన్ సీరియస్ గా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

ఏపీలో వాస్తవ పరిస్థితులను వివరిస్తూ జాతీయ మీడియాకు లేఖలు రాయడమా లేక ప్రెస్ మీట్ లు నిర్వహించడమా అనే విషయంపై లోతుగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

తాజా వార్తలు