కేసీఆర్‌ మాటలపై జాతీయ మహిళ కమీషన్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇటీవల ఆర్టీసీ కార్మికులతో భేటీ అయిన విషయం తెల్సిందే.డిపోకు అయిదుగురు చొప్పున కేసీఆర్‌తో భేటీకి వెళ్లారు.

 National Mahila Comission Chairperson On Rekha Sharma-TeluguStop.com

ఆ సందర్బంగా ఆర్టీసీ సంస్థపై మరియు కార్మికులపై వరాల జల్లు కురిపించాడు.ఈ సందర్బంగా కేసీఆర్‌ మాట్లాడుతూ మహిళ కండాక్టర్లకు ఇకపై 8 గంటల తర్వాత డ్యూటీ ఉండకుండా చూస్తామని హామీ ఇచ్చాడు.

రోజులు బాగాలేవు అందుకే 8 గంటల వరకు వారు ఇంటికి వెళ్లి పోయేలా చూస్తామంటూ ఈ సందర్బంగా కేసీఆర్‌ ప్రకటించాడు.

ఆ ప్రకటనపై జాతీయ మహిళ కమీషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి మహిళలను కించపర్చే విధంగా మాట్లాడారు.మహిళలకు పురుషులతో సమానమైన హోదా మరియు రక్షణ ఇవ్వాలి.

వారిని 8 గంటల వరకు ఇంటికి పరిమితం చేయడం ఏంటీ అంటూ ఈ సందర్బంగా ఆమె ప్రశ్నించారు.ముఖ్యమంత్రి నిర్ణయం ఏమాత్రం కరెక్ట్‌ కాదని, వారికి రక్షణ కల్పించాల్సింది పోయి వారిని 8 గంటలకే ఇంటికి చేరుకోవాలంటూ సూచించడం ఏంటంటూ ఆమె ప్రశ్నించింది.

రేఖ శర్మ వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్పందిస్తూ నిజాలు తెలుసుకుని మాట్లాడాలని, సగం సమాచారంతో అస్సలు స్పందించవద్దంటూ హితవు పలికాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube