టీడీపీ సర్కార్ అవినీతికి సాక్ష్యం ఇంతకంటే ఉంటుందా! గ్రీన్ ట్రిబ్యునల్ వంద కోట్ల జరిమానా  

టీడీపీ ప్రభుత్వంకి వంద కోట్ల జరిమానా విధించిన గ్రీన్ ట్రిబ్యునల్. .

National Green Tribunal 100 Crores Fine To Tdp Government-krishna River,national Green Tribunal,sand Mafia,tdp Government,ysrcp

టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు ఎంత దారుణంగా అక్రమలాకి పాల్పడ్డారు, ఎ స్థాయిలో అవినీతి పెరిగిపోయింది అనే విషయాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాల్ మనీ రాకెట్ నుంచి, ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా వరకు అన్నింట్లో అధికార పార్టీ నేతల హస్తం ఉంది. అయితే తమ ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి జరగలేదనే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకులని వెనకేసుకుంటూ వచ్చారు...

టీడీపీ సర్కార్ అవినీతికి సాక్ష్యం ఇంతకంటే ఉంటుందా! గ్రీన్ ట్రిబ్యునల్ వంద కోట్ల జరిమానా-National Green Tribunal 100 Crores Fine To TDP Government

అలాగే అవినీతిని అడ్డుకునే ప్రభుత్వ అధికారులపై చేసిన దౌర్జన్యాలని కూడా ఆపే ప్రయత్నం చేయకపోగా, మళ్ళీ అధికారుల మీదనే చర్యలు తీసుకున్నారు.

అయితే ఇన్ని అవినీతి, అక్రమాలు చేసిన టీడీపీ సర్కార్ మళ్ళీ ఏపీ అభివృద్ధి అంటూ కొత్త మాటలు మాట్లాడటంతో ప్రజలు వారికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఏపీ ప్రభుత్వం అవినీతిని బట్టబయలు చేస్తూ, గ్రీన్ ట్రిబ్యునల్ టీడీపీ సర్కార్ ని ఏకంగా వంద కోట్ల జరిమానా విధించింది.

ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారుకు ఇది గట్టి ఎదురుదెబ్బ అని చెప్పాలి. కృష్ణానది తీరంలో ఇసుక అక్రమ తవ్వకంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. వంద కోట్ల జరిమానా చెల్లించాలంటూ టీడీపీ సర్కార్ కి ఆదేశించింది.

రోజుకు 2,500 ట్రక్కుల్లో 25 మీటర్ల లోతు వరకూ అక్రమంగా ఇసుక తవ్వుతున్నారంటూ కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన నివేదిక ఆధారంగా జాతీయ హరిత ట్రిబ్యునల్ ఈ నిర్ణయం తీసుకున్నది. ఏపీలో కృష్ణా, తుంగభద్ర, గోదావరి తీరాల వెంట ఇసుకను అక్రమంగా తవ్వుతూ వ్యాపారాలు చేస్తున్నారని. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వాటర్‌మ్యాన్ రాజేంద్రసింగ్, అనుమోలు గాంధీ ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై విచారణ చేపట్టిన కాలుష్య నియంత్రణ మండలి ఇసుక మాఫియా అనేది వాస్తవం అని స్పష్టం చేస్తూ ట్రిబ్యునల్ ని నివేదిక ఇచ్చింది. దీంతో గ్రీన్ ట్రిబ్యునల్ టీడీపీ సర్కార్ కి భారీ జరిమానా విధించింది.