తలకిందులైన జాతీయ జెండా! మంత్రి అలసత్వంపై సోషల్ మీడియాలో ట్రోల్స్  

National Flag Unfurled In Republic Day Celebrations In Vizag-republic Day Celebrations,vizag,ysrcp

ఇండియాలో జాతీయ జెండాని ఎంత గౌరవంగా చూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.జాతీయ జెండాని ఎవరైనా అవమానించిన కేసులు పెడుతూ ఉంటారు.

National Flag Unfurled In Republic Day Celebrations Vizag-Republic Vizag Ysrcp

ఇక విదేశీయులు అయిన భారత్ జాతీయ జెండాని చిన్న చూపు చూసిన దానిపై భారతీయులు చాలా తీవ్రంగా స్పందిస్తూ ఉంటారు.ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత జాతీయ జెండా విషయంలో ఎక్కడ నిర్లక్ష్యం జరిగిన క్షణాల్లో వైరల్ అయిపోతుంది.

తప్పుని సరిదిద్దుకునే లోపే జరగాల్సిన ట్రోలింగ్ జరిగిపోతుంది.

గతంలో జాతీయ గీతాన్ని సరిగా ఆలపించలేక విమర్శలు ఎదుర్కొన్న వైసీపీ నేతలు ఈ మధ్య కాలంలో వారు వివాదాస్పద వ్యక్తిత్వంతో కొంత మంది తరుచుగా వార్తల్లో నిలుస్తున్నారు.

గత ఏడాది ఆగష్టు 15 సందర్భంగా ఏలూరులో మంత్రి ఆళ్ళనాని జెండా వందనంలో తలక్రిందులైన జెండా ఎగరేసి విమర్శల పాలయ్యారు.జెండా ఎలా ఎగరేయాలో కూడా మంత్రులకి తెలియదా అంటూ సోషల్ మీడియాలో చాలా మంది విమర్శలు చేశారు.

ఇప్పుడు మరోసారి అలాంటి తప్పుడు విశాఖలో మంత్రి అవంతి పాల్గొన్న గణతంత్ర వేడుకలో జరిగింది.విశాఖపట్నంలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో వైసీపీ కార్యకర్తలు తలకిందులుగా కట్టిన జెండాను ఎగరేశారు.

దానిని మంత్రి అవంతి కూడా ముందు చూసుకోలేదు.అలాగే జాతీయ గీతం కూడా ఆలపించారు.తరువాత ఎవరో చెప్పడంతో తప్పు గ్రహించి సరిదిద్దుకునే ప్రయత్నం చేసి మంత్రి అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తల మీద ఆగ్రహం వ్యక్తం చేసి మళ్ళీ జెండాని మార్చి జెండా వందనం చేశారు.అయితే దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ మంత్రులు అందరికి ఎన్ని తెలివితేటలో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ట్రోల్ చేస్తున్నారు.

.

తాజా వార్తలు

National Flag Unfurled In Republic Day Celebrations In Vizag-republic Day Celebrations,vizag,ysrcp Related....