ఆర్టికల్ రద్దుపై సుప్రీం ని ఆశ్రయించిన ఒమర్ అబ్దుల్లా పార్టీ

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.ఐతే కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్య‌తిరేకిస్తూ ఒమ‌ర్ అబ్దుల్లాకు చెందిన నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించినట్లు సమాచారం.

 National Congress Moves Sc Against Central Government Decision-TeluguStop.com

జ‌మ్మూక‌శ్మీర్‌కు చెందిన ఆ పార్టీ రాష్ట్ర‌ప‌తి ఉత్త‌ర్వుల‌ను కూడా త‌ప్పుప‌డుతూ కోర్టులో పిల్ వేసింది.

-Political

ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో ఇప్పటివరకు అమలవుతూ వచ్చిన ఆర్టికల్ 370 ని రద్దు చేయాలనీ కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా సభలో ప్రతిపాదన చేయడం దానికి రాష్ట్రపతి గెజిట్ కూడా జారీ చేసిన విషయం తెలిసిందే.దీనితో జమ్మూ కాశ్మీర్ రెండు యూటీలుగా మారిపోయింది.అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయం కారణంగా అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకూడదని కేంద్రం ముందుగానే అక్కడ భారీ గా బలగాలను మోహరించింది.

ఈ క్రమంలో అక్కడ పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ తో పాటు మొబైల్,ఇంటర్నెట్ సేవలను కూడా బంద్ చేసింది.అయితే ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితులు ఒక్కొక్కటిగా చక్కబడుతున్నాయి.

-Political

కొన్ని ప్రాంతాల్లో 144 సెక్ష‌న్‌ను ఎత్తివేయడమే కాకుండా మొబైల్ స‌ర్వీల‌ను కూడా పున‌రుద్దించారు.ఇవాళ జ‌మ్మూలో స్కూళ్లు తెరుచుకున్నాయి.స్థానిక ప్ర‌జ‌లు నిత్యావ‌స‌ర వ‌స్తువుల కోసం మార్కెట్ల‌కు వెళ్తున్నారు.అయితే ఈ ఆర్టికల్ రద్దు ను తొలినుంచి వ్యతిరేకిస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తుంది.

మరి దీనిపై సుప్రీం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube