నటరాజ్ మాస్టర్ అంటున్న గుంట నక్క ఎవరు?

తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 5 చాలా ఆసక్తికరంగా రంజుగా సాగుతున్న విషయం తెల్సిందే.అప్పుడే మొదటి వారం ముగించుకుని రెండవ వారంలోకి అడుగు పెట్టింది.

 Nataraj Master Comments On In Bigg Boss House-TeluguStop.com

అదుగో ఇదుగో అంటూనే అప్పుడే రెండవ వారంలోని ఎలిమినేషన్ నామినేషన్ పక్రియ జరిగింది.ఈ పక్రియలో భాగంగా ఇంటి సభ్యులను నక్క మరియు గద్ద ల టీమ్‌ లుగా ఎంపిక చేయడం జరిగింది.

ఈ రెండు టీమ్ లు అవతలి వారిని ఎలిమినేషన్ కు నామినేట్‌ చేయాల్సి ఉంటుంది.ఇంటి సభ్యులు మొత్తం ఈసారి ఏడుగురు సభ్యులను ఎలిమినేట్‌ చేసేందుకు నామినేట్‌ చేయడం జరిగింది.

 Nataraj Master Comments On In Bigg Boss House-నటరాజ్ మాస్టర్ అంటున్న గుంట నక్క ఎవరు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏడుగురిలో ఉమా, ప్రియ, ప్రియాంక, నటరాజ్, యానీ, లోబో మరియు కాజల్ లు నామినేట్‌ అయ్యారు.ఈ వారం వీక్ కంటెస్టెంట్స్ లో ఉమా ముందు ఉంటారు అంటూ అప్పుడే నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ఉమ పై ఓ రేంజ్ లో ట్రోల్స్ పడుతున్నాయి.ఇక ఎలిమినేషన్ నామినేషన్ పక్రియ సమయంలో నటరాజ్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కాస్త విచిత్రంగా విడ్డూరంగా అనిపించాయి.

తనను తొక్కేసేందుకు ఒక గుంట నక్క మేక వేశంలో హౌస్‌ లో అడుగు పెట్టింది.ఆ గుంట నక్క మరి కొందరిని ఉసిగొల్పి నామినేట్ చేసేలా చేసింది.

Telugu Anee, Bb News, Bb5, Film News, Fox And Eagle Teams, Kaja, Lobo, Nagarjuna, Nataraj Master, Natraj, Priya, Second Week Elimination Nominations, Telugu Bigg Boss, Uma-Movie

నేను ఆ విషయం చూసుకుంటాను అంటూ బిగ్‌బాస్‌ హౌస్ లో నటరాజ్ మాస్టర్ ఛాలెంజ్ చేశాడు.అయితే మాస్టర్‌ గుంట నక్క ఎవరు అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.ఆ విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత మాస్టర్ కు ఉంది.కాని ఆయన మాత్రం ఆ విషయంలో స్పందించడం లేదు.టైమ్ వచ్చిన సమయంలో ఆయన చెప్తాను అంటున్నారు.దాంతో సోషల్‌ మీడియా జనాలు ఎవరికి తోచినట్లుగా వారు పేర్లు ఊహించేసుకుంటున్నారు.

ఈ విషయంలో ఎవరి వాదన వారిది.చివరకు ఏం జరుగుతుందో చూడాలి.

#Kaja #Anee #Natraj #Nagarjuna #Nominations

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు