నాటకం కూడా అర్జున్‌ రెడ్డి బాటలోనే.. తెలుగు సినిమా ముద్దుల్లో మునిగి పోతోంది  

Natakam Movie Teaser Goes Viral-

ఒకప్పుడు ముద్దు సీన్స్‌ అంటే కేవలం హాలీవుడ్‌, బాలీవుడ్‌ సినిమాలకే పరిమితం అయ్యేవి.అడపా దడపా తెలుగు సినిమాల్లో కనిపిస్తే అబ్బో అనుకునేవారు.కాని ఇప్పుడు తెలుగు సినిమాల్లో ముద్దు సీన్స్‌ అనేవి చాలా కామన్‌ అయ్యాయి..

Natakam Movie Teaser Goes Viral--Natakam Movie Teaser Goes Viral-

ఆమద్య వచ్చిన అర్జున్‌ రెడ్డి చిత్రంలో ఏకంగా ముద్దు సీన్స్‌ వర్షం కురిసింది.ఈతరం ప్రేక్షకులకు ఆ సినిమా విపరీతంగా నచ్చేసింది.ముద్దు సీన్స్‌ కారణంగానే అర్జున్‌ రెడ్డి సక్సెస్‌ అయ్యిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆ తర్వాత వచ్చిన ఆర్‌ఎక్స్‌ 100 చిత్రం కూడా నూరు శాతం ముద్దు సీన్స్‌ కారణంగానే విజయాన్ని దక్కించుకుంది.ఆ తర్వాత గీత గోవిందం, వర్మ నిర్మిస్తున్న భైరవగీత ఇలా అన్ని సినిమాల్లో కూడా ముద్దులతో ముంచెత్తారు.

తాజాగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం ‘నాటకం’.పూర్తిగా పల్లెటూరి కాలంలో, కాస్త వెనకటి తరంలో తెరకెక్కిన చిత్రంగా ట్రైలర్‌ను చూస్తుంటే అనిపిస్తుంది.హీరో పూర్తి మాస్‌ క్యారెక్టర్‌లో కనిపిస్తున్నాడు.

అచ్చు అర్‌ఎక్స్‌ 100 చిత్రంలో హీరో మాదిరిగానే క్యారెక్టరైజేషన్‌ ఉండబోతున్నట్లుగా అనిపిస్తుంది.ఆ చిత్రంలో మాదిరిగానే హీరోయిన్‌తో మోటు రొమాన్స్‌ చేయడంతో పాటు, ముద్దులతో హీరో ముంచెత్తాడు.తెలుగు యూత్‌ ఆడియన్స్‌కు ఈమద్య ఇలాంటి చిత్రాలు ఎక్కుతున్నాయి.అందుకే మరోసారి అదే నేపథ్యంలో సినిమాను చేయడం జరిగింది..

తెలుగులో చిన్న చిత్రాల జోరు కొనసాగుతుంది.చిన్న చిత్రాలు సక్సెస్‌ అవ్వాలి అంటే ఖచ్చితంగా ముద్దు సీన్స్‌ ఉండాల్సిందే.ఈమద్య కాలంలో వచ్చిన చిన్న చిత్రాల్లో ముద్దు సీన్స్‌ ఉన్న సినిమాలు మాత్రమే సక్సెస్‌లు దక్కించుకున్నాయి.

భారీ ఎత్తున బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రాలు మాత్రం ముద్దు సీన్స్‌ జోలికి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు.చిన్న చిత్రాల దర్శకులు మాత్రమే ముద్దులతో ప్రేక్షకులను ముంచెత్తాలని ప్రయత్నాలు చేస్తున్నారు.