ఆర్టెమిస్-2లో చంద్రయానం చేసేది ఈ అదృష్టవంతులే..

అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా ( NASA ) చంద్రుడుపైకి 50 ఏళ్ల క్రితం మనుషులను పంపించిన సంగతి తెలిసిందే.ఆ ఘనత 1972లోనే కాదు ఇప్పటికీ ఒక పెద్ద సంచలనమే.

 Nasa Names Astronauts To Next Moon Mission First Crew Under Artemis 2 Mission De-TeluguStop.com

అయితే త్వరలోనే నాసా మళ్లీ మనుషులను చంద్రుని పైకి తీసుకెళ్లనుంది.గతంలో ఆర్టెమిస్ ప్రాజెక్ట్‌లోని ఆర్టెమిస్ 1 విజయవంతం అయ్యింది.

ఈ అన్‌క్రూడ్ మూన్-ఆర్బిటింగ్ మిషన్ సమయంలో, ఓరియన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను స్పేస్ లాంచ్ సిస్టమ్ (SLS) రాకెట్‌లో ప్రయోగించారు.ఇందులోని ఓరియన్ క్యాప్సుల్ చంద్రుడిని చుట్టూ తిరిగొచ్చి సురక్షితంగా భూమిపై దిగింది.

ఆ విజయంతో నాసా సెలబ్రేషన్స్ చేసుకుంది.ఇప్పుడు ఆర్టెమిస్ 2( Artemis II ) మిషన్‌లో భాగంగా SLS రాకెట్‌తో పాటు నలుగురు వ్యోమగాములను చంద్ర గ్రహం( Moon ) పైకి పంపించనుంది.

వీరు ఓరియన్ క్యాప్సుల్‌లో కూర్చుని ఎంచక్కా చంద్రుడి చుట్టూ ఒక చుట్టు చుట్టేసి భూమికి తిరిగి రానున్నారు.నాసా ఆ అదృష్టవంతుల పేర్లను కూడా ప్రకటించింది.వారెవరో ఇప్పుడు చూసేద్దాం.

• క్రిస్టినా కోచ్ (అమెరికా)

Telugu Artemis Ii, Astronauts, Canadianspace, Christina Koch, Crew, Jeremy Hanse

చంద్రుడి కక్ష్యలోకి వెళ్లనున్న మొదటి మహిళ కానున్నారు క్రిస్టినా కోచ్. ఈమె మొదట్లో నాసా గొడార్డ్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా వర్క్ చేశారు.ఆపై ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తించారు.2019లో మహిళా ఆస్ట్రోనాట్లతో కలిసి స్పేస్ వాక్ చేశారు.ఇక త్వరలో చంద్రుడిపై చేపట్టనున్న మిషన్‌కి ఈమె స్పెషలిస్ట్‌గా ఉండనున్నారు.

• జెరెమీ ఆర్.హాన్సెన్(కెనడా)

Telugu Artemis Ii, Astronauts, Canadianspace, Christina Koch, Crew, Jeremy Hanse

ఆర్టెమిస్ 2 మిషన్‌ను నాసా, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ కలిసి చేపడుతున్నాయి.అందుకే కెనడియన్ ఆస్ట్రోనాట్ జెర్మీ ఆర్ హేన్సన్‌కి చంద్రుడి కక్ష్యలోకి వెళ్లే ఛాన్స్ వచ్చింది.హేన్సన్ ఒక ఫైటర్ పైలెట్. కాగా ఆర్టెమిస్ 2 మిషన్ ఆపరేషన్స్‌లో ఇతని రోల్ కూడా చాలా ముఖ్యంగా మారనుంది.

• విక్టర్ గ్లోవర్ (అమెరికా)

Telugu Artemis Ii, Astronauts, Canadianspace, Christina Koch, Crew, Jeremy Hanse

ఇక అమెరికాకు చెందిన మరో ఫైటర్ పైలెట్ విక్టర్ గ్లోవర్ సైతం ఈ అవకాశాన్ని దక్కించుకున్నారు.విక్టర్ 40 రకాల ఎయిర్ క్రాఫ్టులను 3000 గంటలు నడిపి చరిత్ర సృష్టించారు.అంత అనుభవం ఉంది కాబట్టే ఆయనకు ఇప్పుడు ఆర్టెమిస్ 2 మిషన్‌కు పైలెట్‌గా బాధ్యతలు అప్పజెప్పారు.

• రీడ్ వైజ్‌మన్ (యూఎస్ఎ)

Telugu Artemis Ii, Astronauts, Canadianspace, Christina Koch, Crew, Jeremy Hanse

ఇక ఆర్టెమిస్ 2 మిషన్‌ కమాండర్‌గా రీడ్ వైస్ మన్ వ్యవహరించనున్నారు.ఈయనకు సముద్ర గర్భంలోనూ పని చేసిన అనుభవం కూడా ఉంది.అలానే 2014లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఫ్లైట్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube