మార్స్ రోవర్ ఎలా పనిచేస్తుందో మీరే చూడండి..

అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన నాసా( NASA ) చేపట్టిన మార్స్ రోవర్( Mars Rover ) ప్రాజెక్టు గురించి మరోసారి చర్చ జరుగుతోంది.అంగారకుడిపై ( Mars ) నీటి జాడ, అక్కడ మనుగడ గురించి తెలుసుకునేందుకు 2003లో ఈ ప్రాజెక్టును నాసా చేపట్టింది.

 Nasa Mars Rover Replica Unveiled At Visvesvaraya Industrial And Technical Museum-TeluguStop.com

ఇందుగాను 2003లో రోవర్ అపార్చునిటీని అంగారకుడిపైకి పంపించారు.ఈ రోవర్ 2004లో అంగారక గ్రహంపైకి చేరుకుని అక్కడ ల్యాండ్ అయింది.

ఇప్పటివరకు అంగారకుడికి సంబంధించిన అనేక ఫొటోలను ఈ రోవర్ పంపించింది.ఈ ఫొటోలను విశ్లేషించి సైంటిస్టులు అంగారకుడి గురించి అనేక విషయాలు బయటపెడుతున్నారు.

Telugu Bangalore, International, Mars Rover, Nasa, Nasamars, Presence, Space, Sp

దాదాపు 14 సంవత్సరాలుగా ఈ రోవర్ అంగారకుడిపైనే ఉంటూ డేటాను పంపిస్తుంది.అయితే తాజాగా ఈ రోవర్ గురించి మరోసారి చర్చ జరుగుతోంది.దానికి కారణం ఏంటంటే.ఈ రోవర్‌కు సంబంధించిన పూర్తిస్థాయి రెప్లికా బెంగళూరుకు చేరుకుంది.బెంగళూరులోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రీయిల్ అండ్ టెక్నికల్ మ్యూజియంలో దీనిని ప్రదర్శనకు ఉంచారు.ఈ రోవర్ నమూనాను అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీ విద్యార్థులు తయారుచేసి బెంగళూరుకు పంపించారు.

అంతరిక్ష పరిశోధనల వైపు యువత, విద్యార్థులను ఆకర్షితులుగా చేయడానికి ఈ నమూనాలను తయారుచేశారు.

Telugu Bangalore, International, Mars Rover, Nasa, Nasamars, Presence, Space, Sp

ఇండియా-అమెరికా టుగెదర్ ప్రాజెక్ట్ కింద రోవర్ నమూనాలను తయారుచేయించి బెంగళూరుకు పంపినట్లుగా తెలుస్తోంది.తొలిసారి అమెరికాలోని వర్జినియా డల్లాస్ లో గల స్మిత్ సోనియన్స్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంలో దీనికి ప్రదర్శించారు.ఆ తర్వాత దుయాబ్ లో 2020లో జరిగిన వరల్డ్ ఎక్స్‌పోలోని యూఎస్ పెవిలియన్ లో ప్రదర్శనకు ఉంచారు.

ఆ తర్వాత ఇప్పుడు ఇండియాకు పంపించారు.గతంలో చెన్నైలోని యూఎస్ కాన్సులేట్ జనరల్ లో ఉన్న అమెరికన్ సెంటర్‌లో ప్రదర్శనకు ఉంచారు.

ఆ తర్వాత ఇప్పుడు బెంగళూరుకు తీసుకొచ్చారు.బెంగళూరులో యూఎస్ కాన్సుల్ జనరల్ జుడిత్ రవితన్ తాజాగా దీనిని సందర్శించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube