హిందూ ఫోబియా : దేవుడిని నమ్మితే.. సైన్స్‌లో ఎదగకూడదా, భార‌తి సంత‌తి యువతిపై అక్క‌సు!

ఒక వ్యక్తి లేదా సమూహం మనల్ని దాటి ఎదిగిపోతుంటే వారిపై ఈర్ష్య కలగడం మానవుడికి వున్న అతి పెద్ద జబ్బు.ఎదుటి వ్యక్తి ఎదుగుదలను చూసి తట్టుకోలేని ఈ జబ్బుకు మందే లేదు.

 Nasa Intern Pratima Roy Photo With Hindu Gods Goddesses Sparks Controversy On Tw-TeluguStop.com

ఆనాదిగా ఎందరో పతనానికి కారణం ఈ ‘‘ఈర్ష్య, అసూయ, ద్వేషాలే’.ఈ జబ్బు సోకిన వారు కుదురుగా వుండలేరు.ఏదో రకంగా తమ శత్రువుని కిందకి లాగేయాలనే చూస్తారు.

మానవుడు తన జీవన పరిణామ క్రమంలో కొన్ని పరిస్థితులను ఆనాడు తనకున్న మిత దృష్టితో ఆలోచించి కొన్ని అభిప్రాయాలను ఏర్పర్చుకున్నాడు.

కాలక్రమేణా అవే నమ్మకాలుగా స్థిరపడిపోయాయి.దాని ఫలితంగా ఎన్నో సందర్భాలలో ఆలోచించే అవసరం లేకుండానే ఒకప్పటి తన అభిప్రాయాలే నమ్మకాలుగా, ఆ నమ్మకాలే నిజాలుగా నమ్ముతున్నాడు మనిషి.

అవే కొన్ని పేర్లతో ఆచారాలుగా కొనసాగుతున్నాయి.ఇలాంటి నమ్మకాల వల్లనే మనిషి ఒక పరిస్థితిని, ఒక విషయాన్ని కారణబద్ధంగా విశ్లేషించలేకపోతున్నాడు.

దేనినైనా గుడ్డిగా నమ్మకుండా విశ్లేషించి, కారణబద్ధంగా చెప్పడం హేతువాదం.మనిషి అనాగరికంగా, బలహీనంగా ఉన్నపుడు పుట్టిన అహేతుకమైన గుడ్డి నమ్మకాలను ఈ నాటికీ వీడలేకపోతున్నాడు.

అనాగరికం చాలా రూపాలలో మనిషిలోనే తిష్టవేయడం వలన తన ఇంగిత జ్ఞానాన్ని కూడా కోల్పోతున్నాడు.ఇక అసలు విషయంలోకి వెళితే.

అంత‌రిక్ష ప‌రిశోధ‌న కోసం.అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా)లో ఇంట‌ర్న్‌షిప్ అవ‌కాశం పొందిన ఓ భార‌త సంత‌తి హిందూ యువ‌తిని మెచ్చుకోవాల్సింది పోయి కొందరు సోష‌ల్ మీడియాలో విషం చిమ్ముతున్నారు.

దేవుడిని న‌మ్మే ఆమెను నాసాలో చేర్చుకుంటే.ఇక సైన్స్ ప‌ని అయిపోయిన‌ట్టేనంటూ అక్కసు వెళ్లగక్కుతున్నారు.తాము సాధించలేకపోయింది ఈమె సాధించిందన్న అసూయో లేక మరేదైనా కారణమో కానీ ఆ యువతిని తెగ ట్రోల్ చేస్తున్నారు.ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే.

ఆ ట్రోల్ చేసేవారిలో ఇండియ‌న్లు కూడా ఉండ‌టం ఆశ్చ‌ర్యాన్ని కలిగిస్తోంది.

నాసాలో ఇంట‌ర్న్‌షిప్ పొందిన అభ్య‌ర్థుల వివ‌రాల‌ను ఆ సంస్థ ఇటీవ‌ల వారి వివ‌రాలు, ఫోటోల‌ను పంచుకుంది.

అందులో ప్ర‌తిమ రాయ్ అనే ఇండో అమెరిక‌న్ యువతి ఫోటోపై కొంద‌రు ఉద్దేశ్య‌పూర్వ‌కంగా దాడికి దిగారు.ప్ర‌తిమ రాయ్ ఫోటోలో ఆమె వెనుక హిందూ దేవుళ్ల చిత్ర‌ప‌టాలు ఉన్నాయి.

దీంతో హిందూఫోబియా ఉన్న వారికి అది న‌చ్చ‌లేదు.దీంతో నాసా, అలాగే ప్ర‌తిమ రాయ్‌ని ఉద్దేశించి విమ‌ర్శ‌ల‌కు దిగారు.

అయితే ఇదే స‌మ‌యంలో మ‌రికొంద‌రు ప్ర‌తిమ రాయ్‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు.

Telugu Hindu Indian, Americanspace, Hinduphobia, Nasa Internship, Pratima Roy-Te

ప్ర‌తిమ రాయ్ హిందూ దేవుళ్ల చిత్ర‌ప‌టాల‌తో కనిపించింది కాబ‌ట్టి విమ‌ర్శ‌లు చేస్తున్నారు కానీ అదే మరేదైనా మతానికి చెందిన చిహ్నాల‌తో కనిపిస్తే ఇలాగే ప్ర‌శ్నించేవారా అని వారు కౌంట‌ర్ వేస్తున్నారు.దైవ భ‌క్తి ఉన్నంత మాత్రానా.సైన్స్‌ను న‌మ్మకూడదని ఏం లేద‌ని హిత‌వు ప‌లుకుతున్నారు.

ప్ర‌పంచ ప్రఖ్యాత గ‌ణిత మేధావి శ్రీనివాస రామానుజ‌న్.త‌న‌లోని జ్ఞానం అంతా త‌మ కుల‌దైవం ప్రసాదించిందేనని చెప్పుకునేవార‌ని వారు గుర్తు చేస్తున్నారు.

అలాగే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఏ ప్రయోగం మొద‌లుపెట్టాల‌న్నా.ముందుగా సూళ్లూరుపేటలోని గ్రామదేవత ఆశీర్వాదంతో పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో పూజల తర్వాతే చేస్తుందన్న విషయాన్ని తెలుసుకోవాలని గుర్తుచేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube