నాసా చంద్రుడిపై పరిశోధనలు చేస్తూ ఎప్పటికప్పుడు సరికొత్త వివరాలను బయట పెడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఆస్ట్రోనాట్స్ ను మరోసారి చంద్రుడిపైకి పంపించేందుకు పరిశోధనలు చేస్తోంది.
అయితే ల్యూనార్ సర్ఫేస్ కు చేరుకున్న తర్వాత.వారు అక్కడ బాత్రూం కి వెళ్లేందుకు చోటు కావాలంటూ వెతుకుతున్నారు.
ఈ క్రమంలోనే నాసా ఎవరూ ఊహించని సరికొత్త ఆలోచన చేసింది.
చంద్రుడు పైన టాయిలెట్ కట్టేందుకు నిర్ణయించింది నాసా.
దీనికోసం ఒక బెటర్ ప్లాన్ కావాలి అంటూ ఒక ఆఫర్ కూడా విడుదల చేసింది.అయితే హీరో x తో కలిపి ల్యూనార్ చాలెంజ్ కాంపిటీషన్ నిర్వహిస్తోంది నాసా.
అయితే భవిష్యత్తులో ల్యూనార్ లో టాయిలెట్ ఎలా ఉండాలి అనే దానిపై పరిశోధనలు జరుపుతున్న నిపుణులు ఈ టాయిలెట్ ఎంతో అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో ఉండాలని ప్రయత్నిస్తున్నారు పరిశోధకులు.
ఈ నేపథ్యంలో ల్యూనార్ లో టాయిలెట్ కి సంబంధించి ఒక అద్భుతమైన సలహా ఇచ్చిన వారికి ఏకంగా 35 వేల డాలర్ల ప్రైజ్ మనీ కూడా ప్రకటించింది.
భూమిపై ఉండే గురుత్వాకర్షణశక్తి లో ఆరో వంతు అక్కడి ల్యూనార్ తళం లో ఉంటుంది, అందుకనే ఈ టాయిలెట్ విషయంలో ఎంతో ఆచితూచి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందడుగు వేస్తుంది నాసా.చూడాలి మరి నాసా ప్రయత్నం ఫలిస్తుందా లేదా అన్నది.