నాసా మెచ్చిన భారత సంతతి విద్యార్ధి ప్రయోగం..!!!  

Nasa Appreciated Indian Student Experiment-appreciated,experiment,indian Student,indo American,research,space,telugu Nri Updates,కేశవ్ రాఘవన్,నాసా

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ “నాసా” భారత సంతతి విద్యార్ధి కేశవ్ రాఘవన్ అనే 21 ఏళ్ల ఇండో అమెరికన్ చేసిన ఓ ప్రయోగాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు ఎంపిక చేసింది. అతి చిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఇండో అమెరికన్ గా రాఘవన్ గుర్తింపు పొందారు. యాలే అండర్‌ గ్రాడ్యుయేట్ ఏరోస్పేస్ అసోసియేషన్ కి చెందిన రాఘవన్ తో బృందం తో పాటు మరో కొన్ని బృందాలు సైతం అభివృద్ధి చేసిన క్యూబ్‌శాట్‌లను కూడా నాసా నింగిలోకి పంపనుంది..

నాసా మెచ్చిన భారత సంతతి విద్యార్ధి ప్రయోగం..!!!-NASA Appreciated Indian Student Experiment

2020, 2021, 2022లో ప్రయోగించడానికి సిద్దంగా ఉంచిన కొన్ని మిషన్‌లతోపాటు వీటిని కూడా రోదసిలోకి పంపనుందని నాసా తెలిపింది. అమెరికాలో పీహెచ్‌డీ అందుకున్న తొలి ఆఫ్రికన్ అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త ఎడ్వర్డ్ ఏ బౌచెట్ పేరు మీద తాము తయారు చేసిన ఈ క్యూబ్‌శాట్‌కు బీఎల్‌ఏఎస్-బ్లాస్ట్ అని రాఘవన్ బృందం పేరు పెట్టింది.

అయితే ఈ ప్రయోగానికి దాదాపు 30 వేల డాలర్లు ఖర్చు అవుతాయని కానీ , తాము మాత్రం 13 వేల నుంచి 20 వేల డాలర్ల వ్యయంతోనే బ్లాస్ట్‌ను తయారు చేశామని ఆ బృందం ఉపాధ్యక్షుడు. అయితే సుదూర సూపర్‌నోవా నుంచి భూమివైపు ప్రయాణిస్తున్న కణాలకు సంభందించిన వివరాలని ఇది సేకరిస్తుందని రాఘవన్ తెలిపారు.