భగ్గుమంటున్న ఈశాన్య రాష్ట్రాలు...నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు

పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి.అక్కడ ఆందోళనలను మిన్నంటాయి.

 Narth East Students Assam Tripura-TeluguStop.com

రెండు రోజులుగా అక్కడ నిరసన ప్రదర్శనలు హోరెత్తుతూనే ఉన్నాయి.ఉన్నాయి.

నార్త్ ఈస్ట్ విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన బంద్‌ విజయవంతంగా సాగింది.దీంతో చాలాచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

విద్యార్థులు రోడ్లపైకి వచ్చి రాస్తారోకో నిర్వహించారు.టైర్లను నిప్పంటించి రోడ్లపైకి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.చాలాప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందగా ఈ బంద్‌లో పాల్గొన్నారు.రెండో రోజు కూడా అస్సాం, త్రిపుర రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి

Telugu Assam, Narth, Tripura-Telugu Political News

దీంతో కేంద్ర ప్ర‌భుత్వం అద‌న‌పు సైనిక బ‌ల‌గాల‌ను పంపించింది.ఐదువేల మంది సైనికులను, 20 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను పంపించినట్టు సమాచారం.ఇక్కడ జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో ఈశాన్య రైల్వే శాఖ ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు రైళ్లను రద్దు చేసింది.

అస్సాంలో విద్యార్థులు అసెంబ్లీ ముందు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో హింస చెలరేగింది.విద్యార్థులపై లాఠీచార్జ్ కూడా చేశారు.కొన్ని చోట్ల జ‌రిగిన అల్ల‌ర్ల‌లో జ‌ర్న‌లిస్టులు కూడా గాయ‌ప‌డ్డారు.త్రిపుర ప్ర‌భుత్వం మొబైల్ ఇంట‌ర్నెట్‌, ఎస్ఎంఎస్ స‌ర్వీసుల‌ను నిలిపివేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube