'ఆహా' వారి నుండి మరో ఆణిముత్యం రాబోతుంది, ఈసారి నారింజ మిఠాయి  

Narinja Mithayi Movie Release In Aha Ott, Narinja Mithayi Movie,Aha, OTT Release, Samudrakhani, OTT Movies, Allu Aravind - Telugu Aha, Allu Aravind, Narinja Mithayi, Narinja Mithayi Movie, Narinja Mithayi Movie Release In Aha Ott, Ott, Ott Movies, Ott Release, Samudrakhani

అల్లు అరవింద్‌ ఆహా ఓటీటీ ప్రారంభించిన సమయంలో అందులో ఉన్న కంటెంట్‌ చూసి అంతా నవ్వుకున్నారు.ఈ కంటెంట్‌ తో మీరు ఓటీటీని నడపాలని అనుకుంటున్నారా అంటూ విమర్శలు చేశారు.

TeluguStop.com - Narinja Mithayi Movie Release In Aha Ott

బూతు కంటెంట్ కావాంటే ఆహాకు వెళ్లండి అన్నట్లుగా పరిస్థితి ఉంది.ఓటీటీ కంటెంట్ అంటేనే బూతు కనుక మేము బూతు వెబ్‌ సిరీస్ లను మాత్రమే తీసుకు వస్తామని ముందుగానే అల్లు వారు అన్నారు.

అయితే అలా చేస్తే ఫ్యామిలీ ఆడియన్స్ రావడం లేదని గ్రహించిన అల్లు వారు కొత్త సినిమాలను కూడా తీసుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నారు.ఇదే సమయంలో మలయాళం సినిమాలను డబ్బింగ్‌ చేయడం ఓటీటీ సినిమాలను నిర్మించడం వంటివి చేస్తున్నారు.

TeluguStop.com - ఆహా’ వారి నుండి మరో ఆణిముత్యం రాబోతుంది, ఈసారి నారింజ మిఠాయి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈమద్య కాలంలో వరుసగా ఆహా లో మంచి మంచి కంటెంట్‌ ను పెడుతున్నారు.ఇప్పటికే మెల్‌ మరియు సూపర్‌ ఓవర్‌ సినిమాలు ఆకట్టుకుంటున్నాయి.

ఇప్పుడు మరో మంచి సినిమా రాబోతుందని ఆహా వారు ప్రకటించారు.

ఆహాలో వస్తుంది అంటే ఖచ్చితంగా అదో మంచి సినిమాగా ఉంటుందని, ఒక వేళ అది డబ్బింగ్‌ అయితే కూడా ఖచ్చితంగా మంచి కంటెంట్‌ ఉన్న సినిమానే ఉంటుందని ఇప్పటికే విడుదల అయిన సినిమాలను బట్టి ఆహా ప్రేక్షకులు ఒక అంచనాకు వచ్చారు.

ఇప్పుడు నారింజ మిఠాయి అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యారు.ఈ సినిమాను ఈనెల 29 న ఆహాలో స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన చేశారు.

ఈమద్య తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతున్న నటుడు కమ్‌ దర్శకుడు సముద్రఖని.ఇటీవల ఈయన క్రాక్ సినిమాలో నటించి వావ్‌ అనిపించిన విషయం తెల్సిందే.ఈ సినిమాలో కూడా ఆయన నటించాడు.ఒక మంచి పాత్రను చేయడంతో పాటు చాలా సహజంగా నటించాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్‌ ఎప్పుడెప్పుడు అవుతుందా అంటూ కొందరు ఎదురు చూస్తున్నారు.ఎట్టకేలకు వారి ఎదురు చూపులకు తెర పడబోతుంది.ఈ సినిమాలో హీరోయిన్‌ గా సునైనా నటించింది.ఇంకా పలువురు ముఖ్య నటీనటులు ఈ సినిమాలో కనిపించారు.

#Narinja Mithayi #OTT Release #OTT Movies #Allu Aravind #NarinjaMithayi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు