నాలుగోవ పెళ్లి చేసుకుంటూనే పెళ్లి గొప్పతనాన్ని చెప్తున్న నరేష్...

టాలీవుడ్ లో రోజుకు ఒక న్యూస్ నెట్లో తెగ వైరల్ చేస్తూ ఉంటాయి.

అలాంటి వాటిలో ఒకటే నరేష్( Naresh ), నటి పవిత్ర( Pavitra ) పెళ్లి విషయం అయితే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ చాలా వార్తలు వచ్చాయి దానికి నరేష్ మూడవ భార్య కూడా చాలా కోపం గా వాళ్ళు అలా ఎలా పెళ్లి చేసుకుంటారో నేను చూస్తా అంటూ ఆమె కూడా మీడియా ముఖంగా ఆవిడా ఆవేదన వ్యక్తం చేసారు.

అయితే రీసెంట్ గా నరేష్ పవిత్ర ఇద్దరు పెళ్లి చేసుకుంటున్న ఒక వీడియో బయటికి వచ్చింది.దాంతో అందరు వీళ్లిద్దరికీ పెళ్లి అయిపొయింది అనుకున్నారు కానీ పెళ్లి అవ్వలేదు.

మరి ఆ వీడియో ఎలా వచ్చింది అంటే నటుడిగా నరేష్ 50 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ( Golden Jubilee Project )ను తాజాగా ప్రకటించారు.తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్నఈ చిత్రంతో విజయ కృష్ణ మూవీస్ అనే బ్యానర్ ని నరేష్ పునరుద్ధరిస్తున్నారు.ఈ సందర్భంగా చిత్రం టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మళ్లీ పెళ్లి అనే టైటిల్‌ను ఖరారు చేశారు.ఫస్ట్-లుక్ పోస్టర్‌లో సాంప్రదాయ దుస్తులలో నరేష్ - పవిత్రా ఆకట్టుకుంటున్నారు.

Advertisement

గ్లింప్స్ లో పవిత్రా తమ ఇంటి ముందు ముగ్గేస్తుంటే నరేష్ దగ్గరగా వచ్చి చూసే సీన్ ఆకట్టుకుంటోంది.

ఫస్ట్‌లుక్ పోస్టర్ చాలా ఆహ్లాదకరంగా ఉంది.దీంతో సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని అర్థం అవుతోంది.నరేష్ , పవిత్ర మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా వినసొంపుగా ఉంది.

చిత్రంలో జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.అయితే ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఎందుకు ఈ సినిమా చేస్తున్నాడో కూడా నరేష్ ఒక క్లారిటీ ఇచ్చారు.

అయితే ఇదంతా చూసిన జనాలు మాత్రం పెళ్లి గొప్పతనాన్ని తెలిపే సినిమాని మూడు పెళ్లిళ్లు చేసుకొని మళ్లి నాలుగో పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అవుతున్న నరేష్ చెప్పడం ఏంటి దాన్ని మేము చూడటం ఏంటి అంటూ జనాలు నరేష్ మీద ఆ సినిమా మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.

ఆరోగ్యానికి సమోసా మంచిదా? బర్గర్ మంచిదా?.. అధ్యయనంలో తేలిందిదే...
Advertisement

తాజా వార్తలు