లాక్‌డౌన్ తరువాత పని మొదులపెట్టిన తొలి తెలుగు నటుడు.. ఎవరంటే?

కరోనా వైరస్ కారణంగా ఏర్పడ్డ లాక్‌డౌన్ వల్ల అన్ని రంగాలకు చెందిన కార్యక్రమాలు వాయిదా పడ్డాయి.కాగా సినిమా రంగానికి చెందిన ఏ ఒక్క పని కూడా జరగడం లేదు.

 Naresh Starts Dubbing At Ramanaidu Studios, Naresh, Maa, Lockdown, Ramanaidu Stu-TeluguStop.com

అయితే ఈ లాక్‌డౌన్ ఏకంగా రెండు నెలలకు పైగా ఉండటంతో షూటింగ్ మొదలుకొని రిలీజ్‌ల వరకు అన్నీ వాయిదా పడ్డాయి.కాగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సినిమా షూటింగ్‌లకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
దీంతో సినిమా షూటింగ్‌లు నిర్వహించేందుకు టాలీవుడ్ రెడీ అవుతోంది.అయితే లాక్‌డౌన్ నుండి సడలింపులు లభించడంతో టాలీవుడ్‌కు చెందిన సీనియర్ నటుడు నరేష్ ‘జాతి రత్నాలు’ అనే సినిమాలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులు నేడు మొదులుపెట్టారు.

ఈ మేరకు రామానాయుడు స్టూడియోస్‌లో నరేష్ డబ్బింగ్ పనులు మొదులపెట్టారు.ఇలా లాక్‌డౌన్ తరువాత సినిమాకు సంబంధించిన పనులు మొదలుపెట్టిన తొలి వ్యక్తిగా నరేష్ నిలిచారు.
ఇక జాతిరత్నాలు చిత్రంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమాను కెవి అనుదీప్ డైరెక్ట్ చేస్తుండగా మహానటి చిత్ర దర్శకుడు నాగ్అశ్విన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.ఇక తమ సినిమాల పనులు కూడా మొదలుపెట్టేందుకు ఇతర దర్శకనిర్మాతలు రెడీ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube