వీసా ఉన్నా భారత్‌కు రాలేని పరిస్ధితి: ఆందోళన వద్దు.. ఓసీఐ కార్డుదారులకు కేంద్ర మంత్రి శుభవార్త

కరోనా కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల ఇబ్బందులు వర్ణనాతీతం.లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా రవాణా సదుపాయాలు లేకపోవడంతో పరాయి దేశంలో భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 Center To Decide Soon On Overseas Citizen Of India Visa Issue: Union Minister  C-TeluguStop.com

వీరి అవస్థలపై స్పందించిన భారత ప్రభుత్వం … విదేశాల్లో చిక్కుకున్న మనవారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ‘‘వందే భారత్ మిషన్’’ పేరుతో ప్రత్యేక విమాన సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

అయితే విదేశీయుల వీసాలతో పాటు వీసా అవసరం లేకుండా భారతదేశానికి వచ్చే వెసులుబాటు ఉన్న ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.

అమెరికాలో హెచ్1 బీ, గ్రీన్‌కార్డుదారుల పిల్లలు అక్కడే పుట్టడంతో వారంతా ఓసీఐ పరిధిలోకి వస్తారు.ఈ ఆంక్షలే ఇప్పుడు అక్కడ చిక్కుకున్న భారతీయులకు అడ్డంకిగా మారాయి.తల్లిదండ్రులు భారత్‌కు వచ్చేందుకు ఇక్కడి నిబంధనలు అనుమతిస్తున్నప్పటికీ.ఓసీఐ పరిధిలోకి వచ్చే పిల్లల్ని మాత్రం భారత ప్రభుత్వం అనుమతించే అవకాశం లేదు.

Telugu America, Coronavirus, Hb Green Cards, Indian Nris, Muralidharan, Narendra

వీరి ఇబ్బందుల నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ శుభవార్త చెప్పారు.ఓసీఐ కార్డుదారులపై విధించిన తాత్కాలిక నిషేధానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.ఇండియన్ అమెరికన్లు సభ్యులుగా ఉన్న ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ (ఎఫ్ఐఏ), బీహార్, జార్ఖండ్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (బీఏజేఎన్ఏ)తో మురళీధరన్ వర్చువల్ ప్యానెల్ చర్చలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రవాస భారతీయులు ఓసీఐ కార్డుదారులపై వున్న ఆంక్షలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.దీనిపై స్పందించిన మురళీధరన్.మీ ఇబ్బంది ప్రధాని మోడీకి తెలుసునని, త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు.

Telugu America, Coronavirus, Hb Green Cards, Indian Nris, Muralidharan, Narendra

ఇదే సమయంలో కరోనా వైరస్ సంక్షోభం నుంచి ఆర్ధిక వ్యవస్థను గట్టెక్కించేందుకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఆర్ధిక సంస్కరణలను ఉపయోగించుకుని భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని మురళీధరన్ ప్రవాసులను కోరారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube