పవన్ చూపు అటువైపు ఎర్రన్నలు ఎటువైపు ?

అంతన్నాడు ఇంతన్నాడు చివరాఖరికి ఒక్కసీటుకే పరిమితం అయిపోయాడు అంటూ విమర్శలు ఎదుర్కుంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు అసలు సిసలైన రాజకీయం అంటే ఎలా ఉంటుందో బాగా అర్ధం అయ్యింది.రాజకీయం వేరు సినీ గ్లామర్ వెరీ అని రాజకీయాల్లో ఉన్నత శిఖరాలు చేరుకోవాలంటే చాలా విషయాల్లో పై చేయి సాధించాలని పవన్ అర్ధం చేసుకున్నాడు.

 Narendra Modi Pawan Kalyan Janasena Will Be Continue Friendship With Cpi-TeluguStop.com

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా లాభం ఏమి ఉందని చాలామంది చాలా విమర్శలు చేస్తున్న పవన్ వాటిని పట్టించుకునే పరిస్థితుల్లో లేడు.తాను ఫెయిల్యూర్ పొలిటిషన్ కాదని నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాడు పవన్.

ముఖ్యంగా తాను రెండుచోట్ల ఓడిపోవడాన్ని పవన్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.అందుకే ఎవరు ఏమనుకున్నా ఫర్వాలేదు అనుకునే బీజేపీ వైపు చూస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

-Telugu Political News

తాను ఓటమి చెందినా రాజకీయాలను వీడేది లేదని పవన్ ముందు నుంచి చెబుతున్న మాట.తన ఒక్కడి గ్లామర్ మాత్రమే జనసేనకు ఇంధనం కాదని, ఏకపక్ష విజయాలు కాదు కదా, గెలుపు కూడా తన వరకైనా సాధ్యపడదని పవన్ బాగానే అర్ధం చేసుకున్నాడు.ఇపుడు అధికారం సంపాదించడం కోసం సరైన రూట్ మ్యాప్ ని కూడా పవన్ సిధ్ధం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది.బీజేపీకి ఏపీలో నాయకత్వ సమస్య ఉంది.పవన్ కూడా రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే పటిష్టమైన సహకారం కావాలి.ఇలా ఒకరి అవసరాలు మరొకరు తీర్చే విధంగా పవన్ బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నట్టుగా తెలుస్తోంది.

అమెరికాలో బీజేపీ కీలక నేత రాం మాధవ్ తో పవన్ చర్చలు జరపడం దీనిలో భాగంగానే తెలుస్తోంది.ప్రస్తుతం ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీకి పవన్ అవసరం కూడా చాలానే ఉంది.

-Telugu Political News

ఇంతవరకు అంతా బాగానే ఉన్నా, మొదటి నుంచి పవన్ ని అంటిపెట్టుకుని, ఎన్నికల్లో సీట్లు పంచుకున్న వామపక్ష పార్టీల పరిస్థితి ఏంటి అనేది ఎటూ తేలకుండా ఉందట.సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్న కామ్రేడ్స్ కి పవన్ కొత్త బాట కలవరం కలిగిస్తోందట.తమతో పాటు అడుగులు వేసిన పవన్ ఏపీలో కొత్త రాజకీయాన్ని మూడవ రాజకీయ వేదికను నిర్మిస్తారని ఆశపడిన ఎర్రన్నలకు ఫలితాలు తేడా కొట్టాయి.అయినా ఈ ఐదేళ్లు పవన్తోనే ఉండి బలపడదామని ప్రయత్నిస్తున్నాయి.

ఈ సమయంలో పవన్ మాత్రం కమలం వైపు మొగ్గుతున్నట్లుగా కనిపిస్తుండడం ఎర్ర పార్టీలకు ఆగ్రహం తెప్పిస్తోందట.అంతే కాదు అసలు పవన్ ఒంటెద్దుపోకడలు వల్లే ఇలా చేదు ఫలితాలను చవిచూడాల్సి వచ్చింది అంటూ ఆ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు తాజాగా విమర్శలు మొదలుపెట్టారు.

అంతే కాదు పవన్ కనుక బీజేపీకి దగ్గరగా జరిగితే తాము పవన్ నుంచి దూరం జరగాలని చూస్తున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube