ఎవరికి నష్టం లేదు, ఆందోళన అక్కర్లేదన్న మోడీ

జాతీయ పౌరసత్వ సవరణ బిల్లును కేంద్రం తీసుకు రావడంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది.ఈశాన్య రాష్ట్రాల్లో సహా పలు రాష్ట్రాల్లో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి.

 Narendra Modi National Citizenship Amendment Bill-TeluguStop.com

వేరే దేశాల నుండి వలస వచ్చి ఉంటున్న వారికి ఈ చట్టంతో కష్టాలు తప్పవు.అందుకే ఈ బిల్లును వారితో పాటు వారికి సంబంధించిన వారు వ్యతిరేకిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా నిరసనలు మరియు విద్యార్థుల ఆందోళనలతో దద్దరిల్లుతుంది.

ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఈ చట్టంతో ఎవరికి ఎలాంటి నష్టం లేదని, అసలు ఎవరు కూడా దీని వల్ల ఇబ్బంది పడరు అంటూ ఈ సందర్బంగా మోడీ అన్నారు.

ప్రతి ఒక్కరు నిశ్చితంగా ఉండవచ్చు అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.ఈ చట్టంపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.విష ప్రచారం చేస్తూ కొందరు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నరని, ప్రతి పక్షాలు ఇకపై అయినా ప్రజల్లో గందరగోళంను కలిగించవద్దంటూ విజ్ఞప్తి చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube