దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై మోడి కీలక వ్యాఖ్యలు

దేశ ప్రధాని నరేంద్ర మోడి ఆద్వర్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది.ఇప్పటికే అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాట్లు చేశాయి.

 Narendra Modi Launch The Vacine In India,etla Rajendhar,sondhraya Rajan,covaxin,-TeluguStop.com

వ్యాక్సిన్ అవసరం ఉన్నవారికి ఆల్రెడీ మెసేజ్ లు పంపించడం జరిగింది.వారి వ్యాక్సినేషన్ సెంటర్స్ వద్దకు వెళ్ళి తీసుకోవాలిసి ఉంటుంది.

ఈ సందర్భంగా నరేంద్ర మోడి మాట్లాడుతూ.ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇండియా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తుంది అన్నాడు.

మొత్తంగ రెండు వ్యాక్సిన్ లు అందుబాటులోకి వచ్చాయి అని తెలిపాడు.ఎంతో మంది శాస్త్రవేత్తల రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసి తయారు చేశారని గుర్తు చేశాడు.

ఫలితంగా రెండు వ్యాక్సిన్ లు వచ్చాయి అన్నాడు.

ముందుగా వైద్యులకు, పోలీసులకు,డాక్టర్స్ కు పారిశుధ్యకార్మికులకు వ్యాక్సిన్ అందజేస్తాం అన్నారు.

మొదటి విడుతగా 3 కోట్ల మంది వ్యాక్సిన్ ను తీసుకొనున్నారు.ఆ తర్వాత 30 కోట్ల మందికి వ్యాక్సిన్ అందజేస్తాం అని చెప్పాడు.

మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు కచ్చితంగా రెండో దశ వ్యాక్సిన్ ను తీసుకోవాలని గుర్తు చేశాడు.వ్యాక్సిన్ తయారీలో మనదేశ సత్తా ఏమిటో ప్రపంచం మొత్తం తెలిసిందని అన్నాడు.

భారత్ వ్యాక్సిన్ కొరకు ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయని పేర్కొన్నాడు ఈ సందర్భంగా ఈ రోజు వ్యాక్సిన్ తీసుకున్నవారితో మోడిగారు ముచ్చటించనున్నారు.తెలంగాణలో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ నిమ్స్ లోనూ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గాందీ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించాడు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube