మోదీ లాక్‌డౌన్‌ 4.0 పై కమల్‌ స్పందన

ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి లాక్‌డౌన్‌ను పొడగిస్తున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే.కొత్త నిబంధనలతో మరోసారి లాక్‌డౌన్‌ను కొనసాగించబోతున్నట్లుగా ప్రధాని మోడీ నిన్న దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన సందర్బంగా పేర్కొన్నారు.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని మోడీ ప్రకటించారు.మోదీ నిర్ణయాన్ని మెజార్టీ వర్గాల వారు సమర్ధిస్తున్నారు.

 Kamal Hasan Support To Tweet Narendra Modi About Lock Down Extension, Narendra M-TeluguStop.com

తాజాగా ఈ విషయమై సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌ హాసన్‌ కూడా స్పందించాడు.ప్రధాని తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశాడు.

కమల్‌ ఎక్కువ శాతం నరేంద్ర మోడీ నిర్ణయాలను తప్పుబడుతూ ఉంటాడు.ఈసారి మాత్రం ప్రధాని నిర్ణయం పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.

ఆయన తీసుకున్న నిర్ణయం సమర్ధనీయం.ఈ విపత్తు పరిస్థితుల్లో ఉన్న వారి కంటే సామాన్యులు, పేదవారే ఎక్కువగా ఇబ్బందులకు గురి అవుతున్నారు.

వారిని ఆదుకునేందుకు లాక్‌డౌన్‌ సడలించడంతో పాటు వారి ఉపాదికి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవడం హర్షనీయం.అలాగే ఉద్దీపన ప్యాకేజీను ప్రకటించడం కూడా కమల్‌ ఆహ్వానించాడు.

ఈ సమయంలో ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం వల్ల రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుంది.అయితే కేంద్రం ఇచ్చిన ఉద్దీపన పేదలకు ఎంత మేరకు అందుతుందో చూడాలంటూ కమల్‌ ట్వీట్‌ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube