క్యాబినేట్‌ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్న మోదీ

దేశ వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌ డౌన్‌ పరిస్థితులపై నేడు ప్రధాని అధ్యక్షతన క్యాబినెట్‌ సమావేశం వీడియో కాన్ఫిరెన్స్‌ ద్వారా జరిగింది.ఈ క్యాబినెట్‌ సమావేశంలో పలు విషయాలపై చర్చించారు.

 Narendra Modi Take The Critical Decission About Employes And Mp's Salaries Cutti-TeluguStop.com

లాక్‌ డౌన్‌ ఎత్తి వేసే విషయమై ఇటీవల రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన విషయాన్ని పీఎం మోడీ మంత్రులకు తెలియజేశారు.అదే విధంగా దేశ ఆర్థిక పరిస్థితిపై కూడా చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది.

ఇక దేశ వ్యాప్తంగా ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తున్న నేపథ్యంలో ఎంపీలు, మంత్రుల జీతాల్లో కూడా కోతలు విధించేందుకు క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

ఎంపీలు, కేంద్ర మంత్రుల జీతాల్లోంచి 30 శాతంను సంవత్సరం పాటు కట్‌ చేయాలని నిర్ణయించారు.

అలాగే ఎంపీ లాడ్స్‌ నిధులను కూడా తగ్గించాలని నిర్ణయించారు.ఈమొత్తంను కరోనా విపత్తు నేపథ్యంలో ఏర్పాటు చేసిన నిధికి తరలించి కరోనాపై జరుగుతున్న యుద్దంకు ఉపయోగించాలని ప్రధాని నిర్ణయించారు.

అందుకు మంత్రులు అంతా కూడా ఒప్పుకున్నారు.ఇంకా పలు విధాలుగా ఆర్థిక విధానాలను కాపాడుకునేందుకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నట్లుగా మంత్రులు వెళ్లడి చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube