అప్పుడు ఎన్టీఆర్‌కు రాజీవ్‌ సాయం.. ఇప్పుడు జగన్‌కు మోడీ సాయం చేస్తాడా?  

Narendra Modi Help For Jagan About Ap Council Cancel-bjp Narendra Modi,narendra Modi,tdp Ntr And Congress

వికేంద్రీకరణ బిల్లును మండలిలో తెలుగు దేశం పార్టీ అడ్డుకోవడంతో జగన్‌ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాడు.తమకు బలం లేని మండలిని రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చాడు.

Narendra Modi Help For Jagan About Ap Council Cancel-Bjp Narendra Tdp Ntr And Congress

ఇప్పటికే మండలి ఉండాలా వద్దా అనే విషయమై సమగ్ర చర్చ జరగాలంటూ జగన్‌ వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.మండలి రద్దు కోసం జగన్‌ అప్పుడే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాడు అంటూ ప్రచారం జరుగుతోంది.

గతంలో ఎన్టీ రామారావు మండలిలో కాంగ్రెస్‌కు ఎక్కువ సంఖ్యాబలం ఉండి తెలుగు దేశం పార్టీకి తక్కువ సంఖ్యా బలం ఉండటంతో రద్దు చేయడం జరిగింది.అప్పట్లో మండలిని రద్దు చేసేందుకు మొదట ఇందిరా గాంధీ నిరాకరించారు.

కాని ఆమె మరణం తర్వాత పీఎం అయిన రాహుల్‌ గాంధీ మండలి రద్దుకు ఓకే చెప్పాడు.

మండలి రద్దుకు అసెంబ్లీ తీర్మానం ఒక్కటే సరిపోదు.కేంద్ర ప్రభుత్వ ఆమోదం మరియు పార్లమెంటు మరియు రాజ్యసభల ఆమోదం కూడా కావాలి.అంత జరగాలి అంటే కేంద్రంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా సహకరించాలి.

మండలి రద్దుకు ప్రధాని నరేంద్ర మోడీ ఓకే చెప్తే కాని సాధ్యం కాదు.జగన్‌ మరియు మోడీల మద్య ఉన్న సన్నిహితం ఎంత అనేది ఇప్పుడు తెలుస్తుంది.

అసెంబ్లీలో తీర్మానం చేసిన వెంటనే పార్లమెంటుకు వెళ్లాల్సి ఉంటుంది.అక్కడ బీజేపీ ఎలా వ్యవహరిస్తుంది అనేది చూడాలి.మండలి రద్దుకు మోడీ టీం ఓకే చెప్తే కొన్ని వారాల్లోనే మండలి రద్దు జరుగుతుంది.కాని అసెంబ్లీ తీర్మానంను పక్కన పెడితే మాత్రం జగన్‌కు కష్టాలు తప్పవంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు

Narendra Modi Help For Jagan About Ap Council Cancel-bjp Narendra Modi,narendra Modi,tdp Ntr And Congress Related....