అయోధ్య విషయంలో మంత్రులకు, ఎంపీలకు మోడీ సీరియస్‌ వార్నింగ్‌

ఈనెల 17వ తారీకు లోపు అయోధ్య రామమందిరం కేసు తుది తీర్పును సుప్రీం చీప్‌ జస్టీస్‌ గొగోయ్‌ వెలువరించబోతున్నారు.అందుకోసం పూర్తి సన్నద్దం అయ్యింది.

 Narendra Modi Give The Strict Warning To Bjp Leaders And Workers-TeluguStop.com

హిందువులకు అనుకూలంగానే తీర్పు ఉంటుందని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు.ఇలాంటి సమయంలో మోడీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాస్త అనుమానాలకు తావు ఇస్తున్నాయి.

ఇటీవల మోడీ మాట్లాడుతూ మరి కొన్ని రోజుల్లో రాబోతున్న అయోధ్య తుది తీర్పు విషయంలో బీజేపీ నాయకులు ఏ ఒక్కరు కూడా మాట్లాడకూడదు అంటూ ఆదేశించారు.దేశ సామరస్యం మరియు సార్వభౌమాధికారం కాపాడటంలో మనం అందరం కూడా భాగస్వామ్యులం కావాలి.

తీర్పు వచ్చిన తర్వాత బీజేపీ నాయకులు లేదా మరెవ్వరైనా ఆందోళనలు లేదంటే హేట్‌ స్పీచ్‌లు చేసినా కూడా తీవ్రమైన చర్యలు తప్పవంటూ హెచ్చరించాడు.మొదటగా తన కేబినేట్‌ సహచరులకే ఈ విషయాన్ని మోడీ సూచించారు.

ఆ తర్వాత ఎంపీలు మరియు పార్టీ ముఖ్య నాయకులకు కూడా ఈ విషయమై సందేశాలు వెళ్లినట్లుగా తెలుస్తోంది.బీజేపీ అయోధ్య కేసు గెలిస్తే హిందూల పక్షంలో వేడుక నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో మోడీ హెచ్చరికలు జారీ చేయడంతో ర్యాలీలు అన్ని కూడా క్యాన్సిల్‌ చేశారు.ఉత్తర భారతం మొత్తం కూడా పోలీసులతో నిండిపోయింది.ఉంది.రెండు మూడు రోజుల్లో తీర్పు రానుంది.

ఎలాంటి హింస జరుగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube