తొలివిడుత టీకా ఖర్చు కేంద్రమే భరిస్తుంది.. మోడి కీలక ప్రకటన

దేశ ప్రధాని నరేంద్ర మోడీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ విషయంపై స్పందించాడు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈనెల 16 నుండి వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుంది.

 Narendra Modi Give The Clarity On Corona Vacine Distribution,narandra Modi,janua-TeluguStop.com

ముందుగా ఈ టీకాను మూడు కోట్ల మంది సిబ్బందికి అందజేస్తాం అన్నారు.వారు ఆరోగ్య సిబ్బంది, వైద్యులు, పోలీసులు, పరిశుద్య కార్మికులు, ఫ్రంట్ లైన్ వర్కర్స్ మొత్తంగ కలిపి మూడు కోట్ల మంది వరకు ఉంటారు.

వీరికి మాత్రమే ఉచితంగా టీకాను అందజేస్తాం అని తెలిపాడు.దేశ వ్యాప్తంగ కలిపి 30 కోట్ల మందికి వ్యాక్సిన్ అందజేస్తాం అన్నాడు.

వీరి ఖర్చును కేంద్రమే భరిస్తుంది ప్రజా ప్రతినిధులకు మాత్రం ఉచితంగా టీకా అందించడం జరగదు అన్నాడు.ఇప్పటివరకు 50 దేశాల్లో 2.5 కోట్ల మందికి కరోనా టీకా అందింది అని గుర్తుచేశాడు.మన దేశంలో ప్రస్తుతం రెండు కోవిడ్ టీకాలు తయారు అయ్యాయి.

అవి ఇతర దేశాల టీకాలతో పోల్చితే ఎంతో చౌక అయినవి అన్నాడు.మరో నాలుగు వ్యాక్సిన్ లు త్వరలో రాబోతున్నాయి అన్నాడు.

మొదటి దశ టీకాలు వేసిన తర్వాత రెండో దశ టీకా వేసే సమయానికి మిగతా వ్యాక్సిన్ లుకూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి అన్నాడు.నేను మొదటి నుండి ఒక్కటే చెబుతున్నా వ్యాక్సిన్ విషయంలో శాస్త్రవేత్తలదే తుది నిర్ణయం అని అన్నాడు.

మన దేశంలో అత్యవసర వినియోగం కింద రెండు టీకాలు తయారు కావడం గర్వకారణం అని అన్నాడు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube